మంత్రిమండలి
azadi ka amrit mahotsav

సాంకేతిక విద్యలో బహుళ కోర్సుల అభ్యాసం-పరిశోధన మెరుగుకు రూ.4,200 కోట్ల మేర బడ్జెట్ మద్దతుపై మంత్రిమండలి ఆమోదం

प्रविष्टि तिथि: 08 AUG 2025 4:04PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రిమండలి ఈ రోజు దేశంలోని 275 సాంకేతిక విద్యా సంస్థ‌ల‌లో బహుళ కోర్సుల అభ్యాసం-పరిశోధన మెరుగుద‌ల ప‌థ‌కం (ఎంఈఆర్ఐటీఈఅమ‌లు ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపిందిమొత్తం 175 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 100 పాలిటెక్నిక్‌లలో ఈ పథకాన్ని అమలు చేస్తారుజాతీయ విద్యా విధానం-2020 (ఎన్‌ఈపీఅనుగుణ కార్యక్రమాల అమలు ద్వారా అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో సాంకేతిక విద్య నాణ్యతసమానతనిర్వహణ విధానాలను  మెరుగుపరచడం దీని లక్ష్యం.

ఈ కేంద్ర ప్రభుత్వరంగ పథకాన్ని రూ.4,200 వ్యయంతో 2025-26 నుంచి 2029-30 వరకు అమలు చేస్తారుఈ నిధులలో రూ.2,100 కోట్లు (50 శాతంఆర్థిక సంస్థల సహాయం కింద ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రూపేణా అందుతాయి.

ప్రయోజనాలు:

ఈ పథకం కింద ఎంపిక చేసే 275 ప్రభుత్వఎయిడెడ్‌ సాంకేతిక విద్యా సంస్థలకు ఆర్థిక మద్దతు లభిస్తుందిఈ జాబితాలో జాతీయ సాంకేతిక విద్యా సంస్థలు (ఎన్‌ఐటీ)రాష్ట్ర ఇంజినీరింగ్ సంస్థలుపాలిటెక్నిక్‌లుఅనుబంధ సాంకేతిక విశ్వవిద్యాలయాలు (ఏటీయూలుకూడా ఉంటాయివీటితోపాటు సాంకేతిక విద్యా రంగాన్ని పర్యవేక్షించే రాష్ట్రకేంద్రపాలిత ప్రాంతాలకూ చేయూత అందుతుందిమొత్తంమీద దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.

ఉపాధి కల్పన సహా పథకం ప్రభావం:

ఈ పథకం కింద లభించగల కీలక ఫలితాలుపరిణామాలు:

i.       భాగస్వామ్య రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో డిజిటలీకరణ వ్యూహాలు,

ii.       సాంకేతిక కోర్సులలో బహుళ పాఠ్యప్రణాళిక కార్యక్రమాలకు మార్గదర్శకాల రూపకల్పన,

iii.       విద్యార్థుల అభ్యస-ఉపాధి సముపార్జన నైపుణ్యాల మెరుగుదల,

iv.       వివిధ బృందాల్లోని విద్యార్థులలో రూపాంతరీకరణ శాతం పెరుగుదల,

v.       ఆవిష్కరణ-పరిశోధనావరణ వ్యవస్థ బలోపేతం,

vi.       దీర్ఘకాలిక ప్రయోజనాల కింద మెరుగైన నాణ్యతపాలన విధానాలకు భరోసా,

vii.       సాంకేతిక విద్యా సంస్థ స్థాయిలో నాణ్యతకు భరోసాగుర్తింపు పెరుగుదల,

viii.       సముచితకార్మిక మార్కెట్ అనుగుణ పాఠ్యాంశాలు, మిశ్రమ కోర్సుల రూపకల్పన-అమలు

ix.       భవిష్యత్ విద్యారంగ పరిపాలకులప్రత్యేకించి మహిళా అధ్యాపకులను తీర్చిదిద్దడం.

అమలు వ్యూహం.. లక్ష్యాలు

ఈ పథకం అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ సంస్థలుపాలిటెక్నిక్‌లలో ఎన్‌ఈపీ-2020’కి అనుగుణంగా అమలవుతుందిభాగస్వామ్య సంస్థల నాణ్యతసమానతపాలన నైపుణ్యం పెంపు దీని లక్ష్యంకేంద్ర రంగ పథకంగా ఇది అమలు కానుండగాభాగస్వామ్య సంస్థలకు కేంద్ర నోడల్ సంస్థ ద్వారా నిధులు బదిలీ అవుతాయి.

ఈ పథకం అమలులో దేశంలోని ఐఐటీలుఐఐఎంల వంటి ప్రసిద్ధ విద్యాసంస్థలుఏఐసీటీఈఎన్‌బీఏ తదితర ఉన్నత విద్యారంగ నియంత్రణ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

ఉపాధి కల్పన:

సమగ్రబహుముఖ విధానంతో విద్యార్థుల్లో నైపుణ్యం పెంచివారి ఉపాధి సముపార్జన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఈ పథకం ప్రధాన భూమిక నిర్వహిస్తుందిఅనుభవ శిక్షణ (ఇంటర్న్‌షిప్) అవకాశాల కల్పనపారిశ్రామిక రంగ అవసరానుగుణ పాఠ్యాంశాల నవీకరణఅధ్యాపకత్వ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపరిశోధన కేంద్రాల ఏర్పాటు వంటివి ఇందులో భాగంగా ఉంటాయిఅంతేకాకుండా సంపోషక (ఇంక్యుబేషన్), విష్కరణ కేంద్రాలునైపుణ్య-తయారీ ప్రయోగశాలలుభాషా వర్క్‌ షాప్‌ల కింద మద్దతు లభిస్తుందిఈ కార్యక్రమాలన్నీ కాబోయే పట్టభద్రుల ఉపాధి సామర్థ్యం పెంపుఅధిక నియామక అవకాశాలుఅంతిమంగా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ విద్యార్థులపరంగా నిరుద్యోగం తగ్గించడంలో తోడ్పడతాయి.

నేపథ్యం:

ఒక దేశపు సుస్థిరసమగ్రాభివృద్ధి అధికశాతం సాంకేతిక పరిజ్ఞాన పురోగమనంపై ఆధారపడి ఉంటుందిఇందుకోసం విద్యా-పరిశోధన ప్రమాణాల నిరంతర ఉన్నతీకరణ అవశ్యంఈ పరిశోధనలు ఆధునిక సవాళ్ల పరిష్కారానికి అనువైన ప్రాథమిక ఆవిష్కరణలకు తోడ్పడటమేగాక దీర్ఘకాలిక సానుకూల ప్రభావం చూపుతాయిఈ దృక్పథం ప్రాతిపదికగానే ప్రపంచ బ్యాంకు సహకారంతో ఎంఈఆర్‌ఐటీఈ’ పథకం రూపొందిందిఈ పథకం నిర్దేశించిన కార్యక్రమాలకు ‘ఎన్‌ఈపీ-2020’ ద్వారా ఉన్నత విద్యారంగంలో తేదలచిన సంస్కరణలే ఆధారం.

ఈ విధానంలోని ప్రధాన సంస్కరణాంశాల్లో పాఠ్యాంశాల పునర్నవీకరణబోధన విధానంమూల్యాంకనంసాంకేతిక విద్యలో బహుళ కోర్సుల కార్యక్రమాలుపరిశోధనావరణ వ్యవస్థ బలోపేతంభవిష్యత్ విద్యా నిర్వాహకులను తీర్చిదిద్దడంఅధ్యాపక నైపుణ్యం పెంపుసాంకేతిక విద్యలో లింగపరమైన-డిజిటల్ అంతరాల తగ్గింపు తదితరాలు అంతర్భాగంగా ఉన్నాయి.

ఈ పథకంలో భాగస్వామ్య రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలే కీలక పాత్రధారులుపథకం అమలులో ప్రధాన పాత్ర పోషించాల్సింది అవేతదనుగుణంగా అనేక సమావేశాలుసంప్రదింపుల ద్వారా వాటినుంచి అందిన అభిప్రాయాలుసూచనలను సముచిత రీతిలో పరిగణనలోకి తీసుకుని పథకానికి రూపకల్పన చేశారు.

 

***


(रिलीज़ आईडी: 2157093) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Nepali , Marathi , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam