ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిరంతరంగా చేపడుతున్న సంస్కరణలు, రైతుల ప్రయోజనాల పరిరక్షణే ముఖ్యంగా అమలుచేస్తున్న కార్యక్రమాలపై వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని..ఈ సంస్కరణలు, కార్యక్రమాలతో వ్యవసాయ రంగంలో వృద్ధికి ఊతం.. 2047కల్లా ‘వికసిత్ భారత్’ ఆవిష్కరణే లక్ష్యం

Posted On: 05 AUG 2025 12:28PM by PIB Hyderabad

వ్యవసాయ రంగం అంతకంతకూ వృద్ధి చెందడానికి తోడ్పడుతున్న అనేక సంస్కరణలతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడడమే ప్రధానంగా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించిన ఒక వ్యాసాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. 2047 కల్లా అభివృద్ధి  చెందిన భారత్ (‘వికసిత్ భారత్’)ను ఆవిష్కరించే దిశగా అడుగులు వేయాలనేదే ఈ సంస్కరణలు, రైతు ప్రయోజన కార్యక్రమాల లక్ష్యం.

కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసిన వ్యాసానికి ప్రధానమంత్రి స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘వ్యవసాయ రంగం వృద్ధి బాటలో శరవేగంగా దూసుకుపోతుండడానికి దోహదపడుతున్న అనేక సంస్కరణలను, రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. ఇవి వ్యవసాయ రంగం పురోగతికి తోడ్పడ్డాయి. 2047 కల్లా ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడం కూడా ఈ సంస్కరణలు, కార్యక్రమాల ధ్యేయం.’’

 

***


(Release ID: 2157092) Visitor Counter : 3