ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చలనచిత్ర జగతిలో 50 వైభవోపేత సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరు రజినీకాంత్ గారికి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 15 AUG 2025 9:35PM by PIB Hyderabad

చలనచిత్ర సీమలో తిరు రజినీకాంత్ గారు 50 వైభవోపేత సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘చలనచిత్ర జగతిలో తిరు రజినీకాంత్ గారు 50 వైభవోపేత సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు. ఆయన ప్రయాణం స్ఫూర్తిని ఇచ్చేదిగా ఉంది.. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు విభిన్న తరాలకు చెందిన ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపాయి. రాబోయే రోజుల్లో ఆయన ఆయురారోగ్యాలతో ఉండడంతో పాటు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

@rajinikanth”


(Release ID: 2157089)