హోం మంత్రిత్వ శాఖ
స్వాతంత్ర్య దినోత్సవం - 2025 సందర్భంగా 1090 మంది పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, నేర నివారణ సిబ్బందికి శౌర్య/సేవా పతకాల ప్రదానం
Posted On:
14 AUG 2025 9:10AM by PIB Hyderabad
స్వాతంత్ర్య దినోత్సవం 2025 సందర్భంగా 1090 మంది పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ (హెచ్‌జీ అండ్ సీడీ), నేర నివారణ సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు లభించాయి.
233 మందికి శౌర్యపతకం (జీఎం), 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), 758 మందికి ఉత్తమ సేవా పతకం (ఎంఎస్ఎం) లభించాయి.
వివరాలు ఇలా ఉన్నాయి: -
శౌర్య పతకాలు
Name of the Medals
|
Number of Medals Awarded
|
Medal for Gallantry (GM)
|
233*
|
* పోలీసు సేవలు-226, అగ్నిమాపక సేవలు -06, హెచ్‌జీ అండ్ సీడీ- 01
ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో లేదా నేరాలు నియంత్రించడంలో లేదా నేరస్థులను అరెస్టు చేయడంలో చూపించిన అరుదైన ధైర్య సాహసాలకు శౌర్య పతకం (జీఎం) అందిస్తారు. సంబంధిత అధికారి బాధ్యతలు, విధులను పరిగణనలోకి తీసుకొని ప్రమాదాన్ని అంచనా వేస్తారు.
శౌర్య పతకాలు అందుకున్న 233 మందిలో 54 మంది సిబ్బంది వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, 152 మంది జమ్మూ కాశ్మీర్, ముగ్గురు ఈశాన్య ప్రాంతం, 24 మంది ఇతర ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందుకుంటున్నారు.
శౌర్య పతకం (జీఎం): శౌర్యపతకం (జీఎం) పొందిన 233 మందిలో 226 మంది పోలీసు సిబ్బంది, ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది, ఒక హెచ్‌జీ అండ్ సీడీ సిబ్బంది ఉన్నారు.
సేవా పతకాలు
విధి నిర్వహణలో అసాధారణ రీతిలో విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం (పీఎస్ఎం) అందిస్తారు. విధి నిర్వహణలో అంకితభావంతో కూడిన విలువైన సేవలు అందించిన వారికి ఉత్తమ సేవా పతకం (ఎంఎస్ఎం) అందిస్తారు.
మొత్తం 99 రాష్ట్రపతి విశిష్ట పురస్కారాలు (పీఎస్ఎం)లో 89 పోలీసు సేవలకు, 5 అగ్నిమాపక సేవలకు, 3 సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డు సేవలకు, 2 కరెక్షనల్ సర్వీసుకు దక్కాయి. మొత్తం 758 ఉత్తమ సేవా పతకాలు (ఎంఎస్ఎం)లో 635 పోలీసు సేవలకు, 51 అగ్నిమాపక సేవలకు, 41 సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డు సేవలకు, 31 జైళ్ల (కరెక్షనల్ సర్వీసులు) కు సంబంధించిన సేవలకు అందాయి.
Service-Wise Break Up of Medals Awarded
Name of Medal
|
Police Service
|
Fire Service
|
Civil Defence & Home Guard Service
|
Correctional Service
|
Total
|
President’s Medal for Distinguished Service (PSM)
(Total Medal Awarded : 99)
|
89
|
05
|
03
|
02
|
99
|
Medal for Meritorious Service (MSM)
(Total Medal Awarded : 758)
|
635
|
51
|
41
|
31
|
758
|
Details of Awardees List are enclosed as below:
Sl No.
|
Subject
|
Number of Awardees
|
Annexure
|
1
|
Medals for Gallantry (GM)
|
233
|
List-I
|
2
|
President’s Medals for Distinguished Service (PSM)
|
99
|
List-II
|
3
|
Medal for Meritorious Service (MSM)
|
758
|
List-III
|
4
|
State Wise/ Force Wise list of Medals Awardees
|
As per list
|
List -IV
|
Click here to view List-I
Click here to view List-II
Click here to view List-III
Click here to view List-IV
మరిన్ని వివరాలు www.mha.gov.in, https://awards.gov.in వెబ్‌సైట్లలో అందుబాటులోఉన్నాయి.
***
(Release ID: 2156343)
Read this release in:
English
,
Malayalam
,
Kannada
,
Bengali
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil