సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మువ్వన్నెల జెండా ప్రచార ఉద్యమంలో పేర్లు నమోదు చేసుకున్న 5 లక్షల మందికి పైగా యువత: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్


• ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార ఉద్యమం 4వ సంచికను ప్రకటించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

Posted On: 11 AUG 2025 6:46PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్  మహోత్సవ్’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా  మూడు రంగుల జెండాప్రచార ఉద్యమం 4వ సంచికను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సగర్వంగా ప్రకటించిందిభారత జాతీయ జెండా ‘తిరంగా’ను (త్రివర్ణ పతాకంఇంటింటా ఎగరేయడంతో పాటు ఈ భావనను మది నిండా నింపుకొనేటట్లు పౌరులకు స్ఫూర్తిని కలగజేయడం ఈ ప్రచార ఉద్యమం ఉద్దేశం.

ఈ సంవత్సరం మనం ‘తిరంగా ప్రచార ఉద్యమం’ నాలుగో సంచికను ఉత్సవ స్థాయిలో జరుపుకోబోతున్నాందీని కోసం స్వచ్ఛంద సేవకులుగా నమోదు చేసుకున్న యువత సంఖ్య లక్షలు దాటిందని కేంద్ర సాంస్కృతిక మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారుఈ యువతీయువకులలనూప్రజలనూ మూడు రంగుల జాతీయ జెండా ప్రచార ఉద్యమంలో పాల్గొనేలా ప్రేరణను అందించనున్నారని ఆయన అన్నారు.

శ్రీ షెకావత్ ఈ రోజు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ, ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా త్రివర్ణ పతాకఒక్క ప్రచార ఉద్యమ స్థాయికే పరిమితం కాదు.. అంతకు మించి ఇది ఒక భావోద్వేగభరిత ఉద్యమం. 140 కోట్ల భారతీయులను మన జాతీయ జెండా లోని నిత్యశోభాయమానమైన మూడు రంగులతో మేళవిస్తుందన్నారుదీని లక్ష్యం దేశభక్తి భావనను పాదుగొల్పడంపౌరులలో సంతోషం ఉప్పొంగేటట్లు చేయడంతో పాటు మన స్వాతంత్ర్యంమన ప్రజాస్వామ్యాల సజీవ ప్రతీకగా నిలుస్తున్న మువ్వన్నెల జెండా ప్రాధాన్యాన్ని విస్తృత స్థాయిలో చాటిచెప్పడమని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ  వివేక్  అగర్వాల్ తిరంగా పవర్  పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇచ్చి ప్రచార ఉద్యమం సమగ్ర వివరణను కళ్లకు కట్టారుహోం శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిజిత్ సిన్హాజల శక్తి శాఖ ఆర్థిక సలహాదారు శ్రీ సమీర్ కుమార్ తమ తమ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను తెలియజేశారుఈ కార్యక్రమంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖకేంద్ర సాయుధ పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్అధికారులు కూడా పాల్గొన్నారు.

జాతీయ జెండాకుపౌరులకు మధ్య సంబంధాన్ని లాంఛనప్రాయం,  సంస్థాగత సంబంధం  స్థాయుల నుంచి ఒక ప్రగాఢ వ్యక్తిగత అనుబంధం స్థాయికి పెంపొందించాలనే ఉద్దేశంతో ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార ఉద్యమాన్ని రూపొందించారుఇది దేశంలో ప్రతి ఒక్కరూ సంతోషంతోగౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిభారత్ స్వాతంత్ర్యాన్ని పండుగ చేసుకోవాలంటూ పౌరులను ఉత్తేజితులను చేస్తోంది.

ఈ  కార్యక్రమానికి విశేష ప్రతీకాత్మక విలువ కూడా ఉందిమువ్వన్నెల జెండాను ఇంటి వద్ద ఎగరేయడం అంటే అది ఒక వ్యక్తిగత అనుబంధాన్ని చాటడంతో పాటుదేశ నిర్మాణానికి మన వంతు పాటుపడతామన్న నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఒక ప్రతీకఇది మన దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన త్యాగమూర్తులను గుర్తుకు తెచ్చుకోవడానికీఏకతఅఖండతప్రగతి.. ఈ విలువల్ని నిలబెడతామన్న ప్రతిజ్ఞకు కూడా ఒక సంకేతంగా నిలుస్తోంది

ఈ ప్రచార ఉద్యమానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోడల్ మినిస్ట్రీగా వ్యవహరిస్తోందిఈ ప్రచార ఉద్యమంలో పౌరులు పెద్ద  సంఖ్యలో పాల్గొనేటట్లు చూడడానికి రాష్ట్ర  ప్రభుత్వాలుకేంద్ర పాలిత ప్రాంతాలువిద్యాసంస్థలుఇతర సంస్థలతో పాటు సాధారణ ప్రజానీకంతో ఈ శాఖ సన్నిహిత సమన్వయాన్ని నెలకొల్పుకొని పనిచేస్తోందిపౌరులు జాతీయ జెండాను వారి ఇళ్లుకార్యాలయాలుబహిరంగ ప్రదేశాల్లో ఎగరేయాలనీఈ వేడుకల ఫోటోలనుకథనాలను ‘హర్ ఘర్ తిరంగా’ (#HarGharTiranga)కు ట్యాగ్  చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పొందుపరచాలనీ వారికి మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.

గత మూడేళ్లుగా ప్రజలు సమధికోత్సాహంతో పాల్గొంటుండడంతో, ‘హర్ ఘర్ తిరంగా’ ఒక ప్రజా ఉద్యమంగా మారిందిఇది స్వాతంత్ర్య దినోత్సవాన్ని చైతన్యం ఉప్పొంగేదేశమంతటా భిన్నత్వంలో ఏకత్వాన్ని పండుగ చేసుకొనే ఘడియలుగా మలచిందిఈ ఏడాది సంచిక మన జాతీయ స్ఫూర్తినిహర్షాన్ని పునరుద్ఘాటిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరింత సమాచారం కోసం... click here


(Release ID: 2155422)