ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆగస్టు 10న కర్ణాటకలో పర్యటించనున్న ప్రధానమంత్రి

రూ.7,160 కోట్ల వ్యయంతో నిర్మించిన బెంగళూరు మెట్రో పసుపు రంగు మార్గాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి

రూ. 15,610 కోట్లకు పైగా విలువైన బెంగళూరు మెట్రో మూడో దశకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 09 AUG 2025 2:20PM by PIB Hyderabad

ఆగస్టు 10న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించనున్నారుపర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారుఆ తర్వాత బెంగళూరు మెట్రో పసుపు రంగు మార్గాన్ని ప్రారంభించనున్నారుఆర్‌వీ రోడ్ (రాగిగుడ్డనుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన బెంగళూరులో పట్టణ రవాణాకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయడంతోపాటు కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారుఒక కార్యక్రమంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

బెంగళూరు మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌లోని ఆర్‌వీ రోడ్ (రాగిగుడ్డనుంచి బొమ్మసంద్ర వరకు ఉన్న పసుపు రంగు మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 19 కి.మీ.లకు పైగా ఉన్న ఈ మార్గాన్ని రూ.7,160 కోట్ల వ్యయంతో చేపట్టారుఇందులో 16 స్టేషన్లు ఉన్నాయిఈ మార్గం ప్రారంభంతో కర్ణాటక రాజధాని నగరంలో రైళ్లు తిరుగుతోన్న మెట్రో 96 కి.మీ.ల పైకి చేరుతుంది.

రూ. 15,610 కోట్లతో చేపట్టనున్న బెంగళూరు మెట్రో 3వ దశకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారుఈ దశలో మొత్తం 44 కి.మీ.ల మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారుఇందులో 31 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయినివాసపారిశ్రామికవాణిజ్య విద్యా రంగాలకు చెందిన నగరవాసుల ప్రయాణ అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది.

బెంగళూరు నుంచే ప్రధాని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారుఇవి బెంగళూరు నుంచి బెలగావిఅమృత్‌సర్ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రానాగ్‌పూర్ (అజ్నినుంచి పుణే వరకు నడుస్తాయిఈ అధిక వేగంతో నడిచే రైళ్లు ప్రాంతీయ అనుసంధానతను గణనీయంగా పెంచటంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

 

***


(Release ID: 2154697) Visitor Counter : 3