ప్రధాన మంత్రి కార్యాలయం
సర్ గంగారాం ఆసుపత్రిలో శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించిన ప్రధాని
Posted On:
04 AUG 2025 2:17PM by PIB Hyderabad
శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించేందుకు సర్ గంగారాం ఆసుపత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు.
ఎక్స్ లో చేసిన వేర్వేరు పోస్టుల్లో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించడానికి సర్ గంగారాం ఆసుపత్రికి వెళ్లాను. ఆయన కుటుంబాన్ని పరామర్శించాను. హేమంత్, కల్పనతో పాటు శ్రీ శిబు సోరెన్ అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.
@HemantSorenJMM
@JMMKalpanaSoren”
‘‘జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు శ్రద్ధాంజలి ఘటించాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి నా సంతాపాన్ని వ్యక్తం చేశాను. ఆయన తన జీవితాన్ని గిరిజన సమాజ సంక్షేమానికి అంకితం చేశారు. ఈ విషయంలో ఆయన ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా నిలిచిపోతారు.
@HemantSorenJMM
@JMMKalpanaSoren”
(Release ID: 2152096)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam