ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని కేవడియాలో ఏకతా విగ్రహాన్ని సందర్శించిన శ్రీ ఒమర్ అబ్దుల్లా.. ప్రధానమంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
31 JUL 2025 11:05PM by PIB Hyderabad
శ్రీ ఒమర్ అబ్దుల్లా గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక ఏకతా విగ్రహాన్ని, సబర్మతి రివర్‌ఫ్రంటును సందర్శించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతించి, ప్రశంసించారు.
‘ఎక్స్’లో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘కాశ్మీర్ నుంచి కేవడియాకు..!
శ్రీ ఒమర్ అబ్దుల్లా సబర్మతి రివర్‌ఫ్రంట్ వద్ద పరుగెత్తడం, ఏకతా విగ్రహాన్ని సందర్శించడం గురించి తెలిసి, ఇది బాగుందే అనిపించింది. ఏకతా విగ్రహాన్ని చూడడానికి ఆయన రావడం ఒక ముఖ్య సందేశాన్ని అందిస్తోంది.. ఇది, మన దేశంలో వివిధ ప్రాంతాలలో పర్యటించడానికి తోటి భారతీయులకు ప్రేరణనిస్తుంది.
@OmarAbdullah”
(रिलीज़ आईडी: 2151257)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam