ప్రధాన మంత్రి కార్యాలయం
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోదీ, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్
Posted On:
31 JUL 2025 12:32PM by PIB Hyderabad
యూఏఈ అధ్యక్షుడు గౌరవ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న టెలిఫోన్లో సంభాషించారు.
యూఏఈ, భారత్ మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశంలో పరస్పర అంకితభావాన్ని ఇద్దరు నాయకులు స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సహకారంలో భాగమైన వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. రెండు దేశాల ప్రజలకు లబ్ధి చేకూరేలా సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడం, విస్తరించడంపై ప్రధానంగా దృష్టి సారించారు.
భారత చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పాలన కొనసాగించిన రెండో ప్రధానిగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గౌరవ షేక్ మహమ్మద్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి సేవలు అందించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
యూఏఈ అధ్యక్షుడు తెలిపిన శుభాకాంక్షలకు, భారత ప్రజల పట్ల చూపిన ఆప్యాయతకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
***
(Release ID: 2150639)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam