ప్రధాన మంత్రి కార్యాలయం
హరిద్వార్‌లో తొక్కిసలాటలో జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని
Posted On:
27 JUL 2025 12:39PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట కారణంగా ప్రాణ నష్టం జరగటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"ఉత్తరాఖండ్‌కు చెందిన హరిద్వార్‌లోని మానస దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట కారణంగా ప్రాణనష్టం జరగటం తీవ్ర విచారకరం. ప్రియతములను కోల్పోయిన వాళ్లకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు సహాయం అందిస్తోంది: ప్రధానమంత్రి"
(Release ID: 2149156)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam