ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కార్గిల్‌ విజయ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 26 JUL 2025 8:46AM by PIB Hyderabad

కార్గిల్‌ విజయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారుఈ మేరకు “దేశ ప్రతిష్ఠ పరిరక్షణలో జీవితాలను త్యాగం చేసిన భరతమాత సాహపుత్రుల అసమాన శౌర్యపరాక్రమాలను సర్మించుకోవాల్సిన సందర్భమిది” అని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలుమాతృభూమి ఆత్మగౌరవ పరిరక్షణలో జీవితాన్నే పణంగా పెట్టిన భరతమాత సాహస పుత్రుల కుంఠిత దీక్షశౌర్యపరాక్రమాలను ఈ రోజున మన స్ఫురణకు వస్తాయిజన్మభూమి కోసం ప్రాణార్పణకు వెనుదీయని వారి దేశభక్తి తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందిజై హింద్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 2148808)