ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల
Posted On:
25 JUL 2025 9:08PM by PIB Hyderabad
భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మాల్దీవులు అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజు స్మారక స్టాంపులను విడుదల చేశారు.
రెండు దేశాల మధ్యనున్న దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధాలను తెలియజేసేలా ఈ స్మారక స్టాంపులు కేరళలోని బేపూర్ చారిత్రక పడవ కేంద్రంలో చేతితో తయారు చేసిన పెద్ద చెక్క ఓడ అయిన ‘ఉరు’ అనే భారతీయ పడవను, చేపలు పట్టటానికి ఉపయోగించే సంప్రదాయ మాల్దీవుల పడవ అయిన ‘వధు ధోని’ని కలిగి ఉన్నాయి. ఈ పడవలు శతాబ్దాలుగా హిందూ మహాసముద్ర వాణిజ్యంలో భాగంగా ఉన్నాయి. ‘వధు ధోని’ని తీరప్రాంతాలు, సముద్ర దిబ్బల్లో చేపలు పట్టేందుకు ఉపయోగిస్తారు. సముద్రాల విషయంలో మాల్దీవుల సాంస్కృతిక వారసత్వం.. ద్వీప జీవనం- సముద్రం మధ్యనున్న సన్నిహిత బంధాన్ని ఇది తెలియజేస్తుంది.
1965లో మాల్దీవులకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశాల్లో భారత్ ఒకటి. ఈ స్మారక స్టాంపులు రెండు దేశాల మధ్య సన్నిహిత, చారిత్రక సంబంధాలను సూచిస్తాయి.
***
(Release ID: 2148769)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam