భారత ఎన్నికల సంఘం
ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025
* రిటర్నింగ్ అధికారితో పాటు సహాయక రిటర్నింగ్ అధికారులను నియమించిన ఈసీఐ
Posted On:
25 JUL 2025 11:28AM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికను నిర్వహించే బాధ్యత రాజ్యాంగ 324వ అధికరణంలో పేర్కొన్న ప్రకారం భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా..ఈసీఐ)పై ఉంది. ఈ పదవికి ‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం-1952’లో సూచించిన ప్రకారం ఎన్నిక నిర్వహించాలి. ఇందులో భాగంగా ‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సంబంధిత నియమాలు -1974’ను కూడా పాటించాలి.
‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం-1952’లోని మూడో సెక్షన్ సూచిస్తున్న ప్రకారం, కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి ఆ తరువాత రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది. ఈ అధికారి కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయాలి. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ సహాయక రిటర్నింగ్ అధికారులను (ఆర్ఓస్) నియమించేందుకు కూడా అవకాశం ఉంది. ఇప్పటివరకు అనుసరిస్తూ వచ్చిన సంప్రదాయం ప్రకారం, రిటర్నింగ్ అధికారిగా అయితే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను గాని లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను గాని వంతుల వారీగా రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ వస్తున్నారు. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించినప్పుడు, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించారు.
ఈ కారణంతో ఈసీఐ చట్టం, న్యాయ శాఖను సంప్రదించడంతో పాటు రాజ్యసభ గౌరవ డిప్యూటీ ఛైర్మన్ సమ్మతిని కూడా తీసుకొని, త్వరలో నిర్వహించే ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025కు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025 నిర్వహణ ప్రక్రియలో సహాయక రిటర్నింగ్ అధికారులను కూడా భారత ఎన్నికల సంఘం నియమించింది. రాజ్యసభ సచివాలయం సంయుక్త కార్యదర్శి గరిమా జైన్‌ను, రాజ్యసభ సచివాలయం డైరెక్టరు శ్రీ విజయ్ కుమార్‌ను సహాయక రిటర్నింగ్ అధికారులుగా నియమించారు.
అవసరమైన గెజిట్ నోటిఫికేషన్‌ను విడిగా ఈ రోజే జారీ చేయనున్నారు.
***
(Release ID: 2148308)
Read this release in:
English
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam