ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యాలో విమాన దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
Posted On:
24 JUL 2025 11:04PM by PIB Hyderabad
రష్యాలో ఈరోజు ఓ విమానం కూలిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘మేం రష్యాతో పాటు రష్యా ప్రజల వెన్నంటి నిలబడుతున్నాం’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘రష్యాలో విమాన దుర్ఘటన కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి బాధపడ్డాను. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషాద ఘడియలో రష్యాతో పాటు రష్యా ప్రజల వెన్నంటి నిలుస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2148243)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam