సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
1.55 లక్షలకు పైగా ప్రచురణ సంస్థలు.. 908 ప్రైవేట్ టీవీ చానళ్ల స్థాయికి సచేతన భారత పత్రికా-మాధ్యమ వ్యవస్థ విస్తరణ
· దూరదర్శన్ ఉచిత డిష్... ‘బైండ్’ (బీఐఎన్‌డీ) పథకం ద్వారా ప్రాంతీయంగా విస్తరిస్తున్న ప్రసార భారతి
· దూరదర్శన్ ఉచిత డిష్ ద్వారా పలు ప్రాంతీయ భాషల్లో 92 ప్రైవేట్.. 50 దూరదర్శన్ చానళ్లు లభ్యం
Posted On:
23 JUL 2025 8:45PM by PIB Hyderabad
భారత్‌లోని శక్తిమంతమైన పత్రికా-మాధ్యమ వ్యవస్థ ఇటీవలి కాలంలో భారీగా విస్తరించింది. ఈ విశేష వృద్ధి సంబంధిత వివరాలిలా ఉన్నాయి:
· ‘ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా’ వద్ద 2014-15లో నమోదైన ప్రచురణ సంస్థల సంఖ్య 1.05 లక్షలు కాగా, 2024-25 నాటికి 1.55 లక్షలకు చేరింది.
· ఉపగ్రహ ప్రసారాల ప్రైవేట్ టీవీ చానళ్ల సంఖ్య 2014-15లో 821 కాగా, 2024-25 కల్లా 908కి విస్తరించింది.
దేశవ్యాప్తంగా దూరదర్శన్ ఉచిత డిష్ ద్వారా 92 ప్రైవేట్ టీవీ చానళ్లు, 50 దూరదర్శన్ చానళ్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వివిధ ప్రాంతీయ భాషలలో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ విస్తృత సంఖ్యలో ప్రేక్షకులకు చేరువయ్యాయి.
మరోవైపు ప్రసార భారతి నెట్‌వర్క్ నానాటికీ దేశమంతటా విస్తరిస్తోంది. ‘బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బైండ్-బీఐఎన్డి) పథకం 2021-26 కింద ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో మూడు ప్రసార యూనిట్ల (ట్రాన్స్మిటర్లు) ఏర్పాటుకు ఆమోదం లభించిది. ఈ మేరకు మండి, చంబా, ధరమ్పూర్లలో 5, 1, 1 కిలోవాట్ల సామర్థ్యంతో ‘ఎఫ్‌ఎం’ ట్రాన్స్‌మిటర్లను ఏర్పాటు చేస్తారు.
కేంద్ర సమాచార-ప్రసార శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఇవాళ లోక్‌సభలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2147622)