ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోకమాన్య తిలక్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 JUL 2025 9:41AM by PIB Hyderabad

లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు  అర్పించారు. ‘‘అచంచల విశ్వాసంతో మన దేశ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో కీలక పాత్ర పోషించిన మార్గదర్శక నేతలలో ఆయన  ఒకరు’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ:

‘‘లోకమాన్య తిలక్‌ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకొంటున్నాను. అచంచల విశ్వాసంతో భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో కీలక పాత్రను పోషించిన మార్గదర్శక నేతలలో ఆయన ఒకరు. ఇతరులకు సేవ చేయడానికి, జ్ఞానానికి.. ఈ రెంటికీ ఉన్న శక్తిని గుర్తించిన విశిష్ట ఆలోచనపరుడు ఆయన.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2147228) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali-TR , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam