సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏఐ ఆధారిత బహుభాషా పరిష్కారాల అన్వేషణలో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు


‘వేవ్‌ఎక్స్‌ స్టార్టప్ యాక్సిలరేటర్’ కింద ‘భాషాసేతు’ పోటీ గడువు 2025 జూలై 30 వరకు పొడిగింపు

సార్వజనీన... స్వదేశీ డిజిటల్ పరిపాలన కోసం ప్రత్యక్ష భాషానువాద పరిష్కారాలను వేగిరపరచడమే ఈ ప్రభుత్వ కార్యక్రమ లక్ష్యం

Posted On: 22 JUL 2025 6:59PM by PIB Hyderabad

డిజిటల్ పరిపాలన విధానాల్లో భారత్‌ ముందంజ వేస్తున్నకొద్దీపౌరుల మాతృభాషలో ప్రత్యక్ష సమాచార ఆదానప్రదానం అత్యంత కీలకంఇది మరింత భారీ స్థాయిలోసత్వరం విస్తరించేలా భాషా వ్యత్యాసాల తగ్గింపుసమగ్ర-చివరి అంచెదాకా సమాచార ప్రదానం కోసం కృత్రిమ మేధ (ఏఐఆధారిత పరిష్కారాల అన్వేషణ అవశ్యం.

దేశంలో భాషా వైవిధ్యం దిశగా ‘ఏఐ’ సామర్థ్యం సద్వినియోగానికి వీలుగా ‘వేవ్‌ఎక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్’ కింద 'భాషా సేతుపోటీలో భాగంగా నమూనా పరిష్కార ఎంట్రీల సమర్పణకు గడువును సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ 2025 జూలై 30దాకా పొడిగించింది.

భాషా సేతు రియల్-టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్” ఇతివృత్తంగా అంకుర సంస్థల స్థాయిలో ఈ పోటీ ఉంటుందిఇందులో భాగంగా ఏవైనా 12 భారతీయ భాషలలో ప్రత్యక్ష అనువాదంలిప్యంతరీకరణగళ స్థానికీకరణ లక్ష్యంగా ‘ఏఐ ఆధారిత ఉపకరణాల రూపకల్పన నమూనాలను రూపొందించాల్సి ఉంటుందిఈ పోటీలో వర్ధమాన అంకుర సంస్థలుఆవిష్కర్తలు తమ నమూనాలను మరింత మెరుగుపరిచేందుకు అనువుగా గడువు  పొడిగింపు ద్వారా తగిన సమయమిచ్చింది.

భాషా సేతు ఛాలెంజ్

భాషా సేతు ఛాలెంజ్ 2025 జూన్ 30న ప్రారంభం కాగాదేశవ్యాప్తంగా ఆరంభ దశలోని అంకుర సంస్థలుసాంకేతికతల రూపకర్తలలో ఆసక్తి గణనీయ స్థాయిలో పెరిగిందిఈ పోటీ సార్వజనీన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమేగాక ఓపెన్ సోర్స్ లేదా స్వల్ప వ్యయంతో లభించే ‘ఏఐ’ సాంకేతికతల వినియోగానికి చేయూతనిస్తుందిఅదే సమయంలో అందుబాటుసౌలభ్యం చేయగల స్వీయ నమూనాలను కూడా స్వాగతిస్తారు.

ఆసక్తిగల పోటీదారులు వేవ్‌ఎక్స్‌ అధికార పోర్టల్ https://wavex.wavesbazaar.com ద్వారా తమ నమూనాలతో నమోదు చేసుకోవచ్చు.

వేవ్‌ఎక్స్‌ గురించి

వేవ్‌ఎక్స్‌’ అన్నది ‘వేవ్స్‌’ కార్యక్రమం కింద సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక అంకుర సంస్థల సంవర్ధక వేదిక (స్టార్టప్ యాక్సిలరేటర్). మీడియావినోదంభాషా సాంకేతికతలలో ఆవిష్కరణల పెంపు దీని లక్ష్యంముంబయిలో నిర్వహించిన ‘వేవ్స్‌-2025’లో భాగంగా పెట్టుబడిదారులుప్రభుత్వ సంస్థలుసాంకేతిక అగ్రగామి సంస్థల ప్రతినిధుల సమక్షంలో 30కి పైగా అంకుర సంస్థలు తమ ప్రతిభను ప్రదర్శించాయిఆ తర్వాత కూడా ‘హ్యాకథాన్‌మెంటార్‌షిప్నేషనల్‌ ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రేషన్’ తదితరాల ద్వారా తదుపరి తరం ఆవిష్కర్తలకు ‘వేవ్‌ఎక్స్‌’ సాధికారత కల్పిస్తూనే ఉంది.

ప్రస్తుతం ‘వేవ్‌ఎక్స్‌’ కింద భాషా సేతు (ఏఐ ఆధారిత భాషానువాదం), ‘కళా సేతు’ (ఏఐ ఆధారిత సారాంశ సృష్టిపేరిట రెండురకాల పోటీలను నిర్వహిస్తున్నారుఈ రెండింటిలో పాల్గొనే ఔత్సాహికుల కోసం పోటీ గడువును 2025 జూలై 30గా నిర్ణయించారు.

 

***


(Release ID: 2147083)