మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్- 2025’ అవార్డుల
దరఖాస్తుల దాఖలుకు గడువు తేదీ ఈ నెల 31
• బాలల అసాధారణ విజయాలకు గుర్తింపుగా ఈ పురస్కారాల ప్రదానం
Posted On:
16 JUL 2025 4:34PM by PIB Hyderabad
‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పీఎంబీఆర్‌పీ)-2025’ అవార్డులకు నామినేషన్లను సమర్పించాల్సిందిగా మహిళా, బాలల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరోసారి కోరింది. ఈ పురస్కారాలకు ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. చివరి తేదీని ఈ నెల 31 గా నిర్ణయించారు. ఈ అవార్డుల కోసం నామినేషన్లను https://awards.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.
https://youtu.be/mBPi1AoPU0g?si=3eRPdy3tx8fftvKT
క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సాంస్కృతిక రంగాలలో 5-18 ఏళ్ల బాలలు సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా వారికి విశిష్ట సత్కారాన్ని అందించాలనే సంకల్పంతో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల’ను ప్రభుత్వం ప్రారంభించింది. ఆపత్కర పరిస్థితులలో మొక్కవోని ధైర్య సాహసాలను కనబరిచిన ధీర బాలలను కూడా ఈ అవార్డులతో సన్మానిస్తూ వస్తున్నారు.
యోగ్యులు అని భావించే అభ్యర్థులను దేశ పౌరులు, పాఠశాలలు, ఇనిస్టిట్యూట్లు, లేదా సంస్థలు నామినేట్ చేయవచ్చు. బాలలు వారంతట వారు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ వివరాలు :
• చివరి గడువు: ఈ ఏడాది జులై 31
• ఏ పద్ధతిలో: ఆన్‌లైన్‌లో మాత్రమే
• పోర్టల్: https://awards.gov.in
దరఖాస్తుదారులు వ్యక్తిగత వివరాలను తెలియజేస్తూ, పురస్కార కేటగిరీని, ఇటీవలి ఫోటోతో పాటు వివరాలను రూఢిపరిచే డాక్యుమెంట్లను జతచేయాలి. వారు చేసిన గొప్ప పని గురించి, దాని ఫలితాన్ని గురించి ఒక చిన్న వివరణను కూడా దాఖలు చేయాలి.
https://youtu.be/kccmd1P394w?si=Hxkf57Erb4_lGi1R
పురస్కారాలను అందుకోవడానికి అన్ని యోగ్యతలు ఉన్నాయని మీరు భావిస్తున్న బాలల పేర్లను తుది గడువు లోగా నామినేట్ చేయాల్సిందిగా పాఠశాలలకు, యువ బృందాలకు, ప్రభుత్వేతర సంస్థలకు, పంచాయతీలకు, వ్యక్తులతో పాటు ఇతర వర్గాలకూ మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. రండి... మనమందరం కలసి, దేశంలోని పిన్న వయస్కులకు వారికి దక్కాల్సిన గుర్తింపును వారికి అందిద్దాం.
***
(Release ID: 2145352)