ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చరిత్రాత్మక అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 JUL 2025 3:34PM by PIB Hyderabad

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్చరిత్రాత్మక యాత్ర చేపట్టిభూమికి తిరిగివచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఐఎస్ఎస్ చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా కెప్టెన్ శుక్లా సాధించిన విజయం అసాధారణమైందనిదేశ అంతరిక్ష ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టమని ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో స్పందిస్తూ:

చరిత్రాత్మక అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా ముగించుకుని భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను దేశ వాసులందరితో పాటు స్వాగతిస్తున్నానుఅంకిత భావంసాహసంస్ఫూర్తి పెట్టుబడిగా ఐఎస్ఎస్ చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా కెప్టెన్ శుక్లా సాధించిన విజయం కోటి కలలకు ఊపిరి పోస్తోందిమన మానవ-సహిత గగన్ యాన్ మిషన్ ప్రయాణంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2145110) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam