ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం: సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
• పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 JUL 2025 10:02PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల్లో ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల వంతున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియాను సంబంధిత కుటుంబాలకు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌లో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరిగిందని తెలిసి బాధపడ్డాను. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియచేస్తూ.... గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల వంతున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ఇస్తాం- ప్రధానమంత్రి @narendramodi’’.
***
(రిలీజ్ ఐడి: 2145103)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam