హోం మంత్రిత్వ శాఖ
శ్రీ ఫౌజా సింగ్ మృతికి ప్రధాని సంతాపం
Posted On:
14 JUL 2025 9:23PM by PIB Hyderabad
శ్రీ ఫౌజా సింగ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. ఆయన అసాధారణ వ్యక్తిత్వం, అచంచలమైన స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన గొప్ప సంకల్పం కలిగిన విలక్షణమైన క్రీడాకారుడని ప్రధాని ప్రశంసించారు.
ఎక్స్‌లో ఆయన చేసిన పోస్టు:
‘‘అనుపమానమైన వ్యక్తిత్వం, ప్రవర్తన కలిగిన అసాధారణమైన వ్యక్తి ఫౌజా సింగ్. అత్యంత ముఖ్యమైన ఫిట్‌నెస్ విషయంలో భారతీయ యువతకు ఆదర్శంగా నిలిచారు. గొప్ప సంకల్పం కలిగిన విలక్షణ క్రీడాకారుడు. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాకమైన అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.’’
***
(Release ID: 2144784)