ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని వడోదరలో వంతెన కూలి ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 09 JUL 2025 12:49PM by PIB Hyderabad

గుజరాత్‌లోని వడోదరలో ఓ వంతెన కూలిపోయిన ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

మృతుల్లో ప్రతి ఒక్కరికీ  రూ.2 లక్షల వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియాను వారి ఆత్మీయులకు అందించనున్నట్లు,  గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ఇవ్వనున్నట్లు ప్ర‌ధానమంత్రి ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

గుజరాత్‌లోని వడోదరలో ఓ వంతెన కూలిపోయిన ఘటనలో ప్రాణనష్టం జరగడం ఎంతో దు:ఖదాయకం. ప్రియతములను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

మృతులకు ప్రతి ఒక్కరికీ  రూ.2 లక్షల వంతున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను వారి ఆత్మీయులకు ఇస్తాం. గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ఇస్తాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)’’

 


(రిలీజ్ ఐడి: 2143544) సందర్శకుల సూచీ సంఖ్య : : 29