ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 04 JUL 2025 10:40PM by PIB Hyderabad

గౌరవ ప్రధానమంత్రి శ్రీమతి కమ్లా ప్రెసాద్ బిసెసా

గౌరవ సెనేట్ అధ్యక్షుడు శ్రీ వేద్ మార్క్,

గౌరవ స్పీకర్ శ్రీ జగదేవ్ సింగ్,

గౌరవ మంత్రులూ

గౌరవ పార్లమెంట్ సభ్యులు,

నమస్కారం!

శుభోదయం!

గర్వించదగిన ప్రజాస్వామ్యానికీస్నేహపూర్వక దేశానికి ప్రతినిధులుగా ఎన్నికైన మీ ముందు నిలబడటం నాకు ఎంతో గౌరవంగా ఉంది.

నేను 140 కోట్ల మంది భారత ప్రజల శుభాకాంక్షలను తీసుకొచ్చానుఇక్కడికి రాకముందు నేను సందర్శించిన ఘనా ప్రజల నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ ప్రతిష్ఠాత్మక రెడ్ హౌస్‌లో ప్రసంగిస్తున్నందుకు తొలి భారత ప్రధానమంత్రిగా నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను.

స్వేచ్చగౌరవం కోసం ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రజలు చేసిన పోరాటాలకూత్యాగాలకూ ఈ చారిత్రాత్మక భవనం సాక్షిగా నిలిచిందిగత ఆరు దశాబ్దాలుగామీరు న్యాయమైనసమ్మిళితమైనసంపన్నమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుంటూ దీనిని పటిష్టంగా నిలబెట్టారు.

మిత్రులారా

ఈ గొప్ప దేశ ప్రజలు ఇద్దరు విశిష్ట మహిళా నాయకురాళ్లను అధ్యక్షురాలుగాప్రధానమంత్రిగా ఎన్నుకున్నారువారు తమను తాము ప్రవాస భారతీయుల కుమార్తెలమంటూ సగర్వంగా చెప్పుకుంటారువారు తమ భారతీయ వారసత్వాన్ని గురించి గర్వపడతారుభారతదేశంలోవారి నాయకత్వాన్నీధైర్యాన్నీసంకల్ప బలాన్నీ మేము ఆరాధనా భావంతో చూస్తాంవారు మన దేశాల మధ్య భాగస్వామ్య మూలాలు... భాగస్వామ్య కలల ఆధారంగా అల్లుకున్న బంధానికి సజీవ చిహ్నాలు.

గౌరవ సభ్యులారా

వలస పాలన నీడల నుంచి  మన రెండు దేశాలు బయటపడిధైర్యాన్ని సిరాగాప్రజాస్వామ్యాన్ని కలంగా చేసుకుని వాటి సొంత గాథలను లిఖించుకున్నాయి.

నేడుమన రెండు దేశాలు గర్వించదగిన ప్రజాస్వామ్యాలుగాఆధునిక ప్రపంచంలో శక్తికి ఆధారాలుగా నిలిచాయికొన్ని నెలల క్రితంమీరు ఎన్నికలలో పాల్గొని ప్రజాస్వామ్య పండుగను జరుపుకున్నారుశాంతిసుస్థిరతసౌభాగ్యం కోసం ఈ దేశ ప్రజలు చూపిన వివేకందూరదృష్టిని నేను అభినందిస్తున్నానుఈ ఉన్నతమైన సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు కూడా నా అభినందనలు.

మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రి కమ్లా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానుఈ గొప్ప దేశాన్ని నిరంతర వృద్ధిసౌభాగ్యం దిశగా నడిపిస్తున్న ఆమెకు నిరంతర విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

మిత్రులారా

‘‘భారత ప్రజల నుంచి ట్రినిడాడ్టొబాగో ప్రజలకు....’’ అంటూ సువర్ణాక్షరాలతో మీరు స్పీకర్ కుర్చీపై రాసిన అక్షరాలను చూస్తుంటే ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాను.

ఆ కుర్చీ కేవలం చెక్క వస్తువు మాత్రమే కాదు... మన రెండు దేశాల మధ్య స్నేహానికీనమ్మకానికీ బలమైన చిహ్నంఒక ప్రజాస్వామ్యం మరో ప్రజాస్వామ్యం పట్ల చూపే బంధాన్ని ఈ మాటలు వ్యక్తపరుస్తాయి

భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం ఒక రాజకీయ నమూనా మాత్రమే కాదుమాకు అదొక జీవన విధానంమనకు వేల సంవత్సరాల వారసత్వం ఉందిమీ పార్లమెంటులో కూడా కొందరు సభ్యులు ఉన్నారువాళ్ల పూర్వీకులు బీహార్ రాష్ట్రం నుంచి వచ్చారుబీహార్ లో ఒకనాడు జనపదాలు ఉండేవిపూర్వకాలపు ప్రజాస్వామ్య వ్యవస్థలకు పునాది.

మిత్రులారా

మన రెండు దేశాల మధ్య అనుబంధంలో సహజమైన ఆప్యాయత ఉందివెస్టిండీస్ క్రికెట్ జట్టును భారతీయలు అమితంగా అభిమానిస్తారువారు భారత్‌తో కాకుండా వేరేవరితో అయినా ఆడేటప్పుడు మేం వారిని హృదయపూర్వకంగా ప్రోత్సహిస్తాం

మన రెండు దేశాల బంధం శతాబ్దాల నుంచీ పునాది వేసుకున్న సంబంధాలపై నిలబడింది. 180 సంవత్సరాల కిందట భారతీయులు తొలిసారిగా సుదీర్ఘమైనకఠినమైన ప్రయాణం తర్వాత ఈ భూభాగానికి చేరుకున్నారుభారతీయ హృదయ స్పందనలు సముద్రాలు దాటి కరీబియన్ లయతో అద్భుతంగా కలిసిపోయాయి.

ఇక్కడభోజ్‌పురి క్రియోల్‌తో కలిసిపోయింది.

దాల్ పూరీ డబుల్స్‌ను కలిసింది.

తబలా స్టీల్ పాన్‌ను కలిసింది!

నేడుభారతీయ సంతతి ప్రజలు ఎరుపునలుపుతెలుపు జెండాను గర్వంతో ఎగురవేస్తున్నారు!

రాజకీయాల నుంచి  కవిత్వం వరకుక్రికెట్ నుంచి వాణిజ్యం వరకుకాలిప్సో నుంచి  చట్నీ వరకుమీరు ప్రతి రంగంలోనూ తమ వంతు కృషి చేస్తున్నారుఅందరూ గౌరవించే శక్తిమంతమైన వైవిధ్యంలో మీరు అంతర్భాగం. "కలిసి మనం ఆశిద్దాంకలిసి మనం సాధిద్దాంఅనే  నినాదాన్ని సార్థకం చేస్తూ మీరందరూ కలిసి ఒక దేశాన్ని నిర్మించారు.

మిత్రులారా

ఈ రోజు ఉదయంగౌరవ అధ్యక్షురాలు ఈ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని నాకు ప్రదానం చేశారు. 1.4 బిలియన్ల భారతీయుల తరపున నేను దీనిని వినయపూర్వకంగా స్వీకరించాను.

ఇప్పుడుఅపారమైన కృతజ్ఞతతోనేను దీనిని మన రెండు దేశాల మధ్య నిరంతర స్నేహానికి,  పూర్వీకుల బంధాలకు అంకితం చేస్తున్నాను.

మిత్రులారా

ఈ సభలో ఇంతమంది మహిళా సభ్యులను చూసినందుకు నేను సంతోషిస్తున్నానుమహిళల పట్ల గౌరవం భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిందిమన ముఖ్యమైన పవిత్ర గ్రంథాలలో ఒకటైన స్కంద పురాణం ఇలా చెబుతోంది:

దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయన్ |

యత్ ఫలం లభతే మర్త్యః తత్ లభ్యం కన్యా ఏకయా ||

ఈ శ్లోకం భావంపది మంది కుమారులను పెంచడం ద్వారా ఒక మనిషి పొందే ఫలంఒక్క కుమార్తె ద్వారానే పొందవచ్చుఆధునిక భారతదేశాన్ని నిర్మించడానికి మేము మహిళలను శక్తిమంతులను చేస్తున్నాం.

అంతరిక్షం నుంచి  క్రీడల వరకుస్టార్టప్‌ల నుంచి  సైన్స్ వరకువిద్య నుంచి వాణిజ్యం వరకువిమానయానం నుంచి  సాయుధ దళాల వరకువివిధ రంగాలలో మహిళలు భారతదేశాన్ని నూతన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నారుమీలాగేమాకు కూడా ఒక మహిళ ఉన్నారుఆమె నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చి మా రాష్ట్రపతి పదవిని అధిష్టించారు.

రెండు సంవత్సరాల కిందట భారత పార్లమెంటు ఒక చరిత్రాత్మక అడుగు వేసిందిపార్లమెంటురాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మేం నిర్ణయించాంఇది రాబోయే తరాలలోఎక్కువ మంది మహిళలు దేశ భవిష్యత్తునుదిశను నిర్ణయించేలా చేస్తుంది.

భారతదేశంలో మహిళా నాయకులు స్థానిక స్థాయిలో కూడా ఎంతో బలంగా ఎదుగుతున్నారుసుమారు 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు స్థానిక పరిపాలనా వ్యవస్థల్లో నాయకత్వం వహిస్తున్నారుఇప్పుడు మేం మహిళా నాయకత్వంలో అభివృద్ధి యుగంలో ఉన్నాంఇది మా జి-20 అధ్యక్ష కాలంలో మేం ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన అంశాలలో కూడా ఒకటి

భారతదేశంలో మహిళా నాయకత్వంలో అభివృద్ధి కోసం ఒక కొత్త నమూనాను  మేం అభివృద్ధి చేస్తున్నాంమా జి-20 అధ్యక్ష సమయంలో కూడా ఈ నమూనా విజయాన్ని మేం ప్రపంచానికి చూపించాం.  

గౌరవ సభ్యులారా

నేడుభారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థప్రతి రంగంప్రతి ప్రాంతంప్రతి సమాజం ఈ వృద్ధి గాథలో భాగంగా ఉన్నాయి.

భారతదేశ అభివృద్ధి సమ్మిళితమైనదిప్రజలే కేంద్రంగా ఉందిఅంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవల నివేదించిన దాని ప్రకారంభారతదేశ సామాజిక భద్రతసంక్షేమ వ్యవస్థ 950 మిలియన్ల (95 కోట్లుమంది ప్రజలకు భద్రతను అందిస్తోందిఈ లబ్దిదారుల సంఖ్య దాదాపు బిలియన్ఇది ప్రపంచంలోని చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ!

అలాంటి సమగ్ర అభివృద్ధిపై ఉన్న మా దృష్టికోణం మా సరిహద్దుల వద్దనే ఆగిపోదుమా అభివృద్ధిని మేం ఇతరుల పట్ల బాధ్యతగా కూడా భావిస్తాంమా ప్రాధాన్యత ఎల్లప్పుడూ గ్లోబల్ సౌత్ కోసమే ఉంటుంది.

అదే స్ఫూర్తితోమేము ట్రినిడాడ్ అండ్ టొబాగోతో మా సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాంమా వ్యాపారం నిరంతరం వృద్ధి చెందుతోందిఈ దేశంలో మరింత పెట్టుబడి పెట్టడానికి మా వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తున్నాంమన  అభివృద్ధి భాగస్వామ్యం విస్తరిస్తోందిశిక్షణసామర్థ్య నిర్మాణంనైపుణ్యాభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయిఆరోగ్యం మా భాగస్వామ్యంలో ముఖ్యమైన భాగంగా ఉందిఇక ముందూ అలాగే ఉంటుంది.

అనేక మంది భారతీయ వైద్యులుఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఇక్కడ విశిష్ట సేవల్ని అందిస్తున్నారు
. భార వైద్య ప్రమాణాలను గుర్తించాలని మీరు నిర్ణయించడం మాకు సంతోషంగా ఉందినాణ్యమైన మందులను ఇది అందరికీ తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతుంది.

మీరు యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను స్వీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం.  ఇది ఒక ముఖ్యమైన ముందడుగుయూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల పరంగా విప్లవాన్ని సృష్టించింది.

ఈ వేదిక ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులు చేసే దేశంగా అవతరించిందినేడుభారతదేశంలో మామిడి పండ్ల విక్రేతలకు కూడా క్యూఆర్ కోడ్‌లు ఉన్నాయిమీరు వారికి నగదు చెల్లించడానికి ప్రయత్నిస్తేవారి వద్ద చిల్లర లేదని యూపీఐని ఉపయోగించమని వారే మిమ్మల్ని అడుగుతారు!

ఇతర డిజిటల్ ఆవిష్కరణలపై కూడా సహకారం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాంగ్లోబల్ సౌత్‌లో వృద్ధిఅభివృద్ధిని పెంపొందించడానికి భారతదేశం కృత్రిమ మేధ సాధనాలను అభివృద్ధి చేస్తోందిఇందులో ట్రినిడాడ్ అండ్ టొబాగో మాకు ఒక ప్రాధాన్య దేశంగా ఉంటుంది.

వ్యవసాయంఉద్యానవనంఆహార శుద్ధిలో కూడా మా నైపుణ్యాన్ని పంచుకుంటాంభారతదేశం నుంచి  వచ్చే యంత్రాలు మీ వ్యవసాయ పరిశ్రమకు మద్దతు ఇస్తాయిఅభివృద్ధి అనేది గౌరవంతో కూడుకున్నది కాబట్టిఇక్కడ వికలాంగ పౌరుల కోసం మేం ఒక కృత్రిమ అవయవ అమరిక శిబిరాన్ని నిర్వహిస్తాం.

మీతో సహకారానికి మాకు ఎటువంటి పరిమితులూ లేవుమీ అవసరాలుప్రాధాన్యతలకు అనుగుణంగా మేం ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం.

మిత్రులారా

మన దేశాల మధ్య ఉన్న సమన్వయం అపారమైన అవకాశాలను కలిగి ఉందికరీబియన్ ప్రాంతంలో ప్రధాన భాగస్వామిగాలాటిన్ అమెరికాకు ఒక వారధిగా ట్రినిడాడ్ అండ్ టోబాగోకు గొప్ప సామర్థ్యం ఉందిమన బంధం మరింత విస్తారమైన పరిధితో బలమైన అనుసంధానాన్ని ఏర్పరిచేందుకు సహాయపడుతుందనే నమ్మకం నాకు ఉంది.

రెండో ఇండియా-కారికోమ్ సదస్సు స్ఫూర్తితోవాణిజ్యంపెట్టుబడులను పెంపొందించడంమౌలిక సదుపాయాలురాకపోకల సౌకర్యాల అభివృద్ధికమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడంఅన్నింటికంటే మించిపెద్ద ఎత్తున సామర్థ్య పెంపుశిక్షణ,  నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇచ్చే కార్యక్రమాలపై సహకరించడానికి మేము ఆసక్తిగా ఉన్నాం.

మిత్రులారా

మన భాగస్వామ్యాన్ని నేను మరింత విస్తృతమైన గ్లోబల్ పరిధిలో కూడా చూస్తున్నాప్రపంచంలో మార్పుల వేగంవ్యాప్తి ఎప్పుడూ లేని విధంగా ఉందిరాజకీయాల స్వభావంఅధికార కేంద్రీకరణలో సమూల మార్పులు జరుగుతున్నాయిస్వేచ్ఛా వాణిజ్యం ఒత్తిళ్లను ఎదుర్కొంటోందిప్రపంచంలో విభజనలువివాదాలుఅసమానతలు వేగంగా పెరుగుతున్నాయి.

ప్రపంచం వాతావరణ మార్పులుఆహారంఆరోగ్యంఇంధన భద్రత వంటి సవాళ్లను ఎదుర్కొంటోందిఉగ్రవాదం ఒక పెను ముప్పుగా పరిణమించిందిగతంలోని వలస పాలనలు ముగిసినప్పటికీవాటి నీడలు కొత్త రూపాల్లో వెంటాడుతున్నాయి.

అంతరిక్షంసైబర్ భద్రతలో కొత్త సవాళ్లు ఉన్నాయికృత్రిమ మేధ కొత్త అవకాశాలను తీసుకువస్తూనేకొత్త అనర్థాలను కూడా సృష్టిస్తోందిపాత సంస్థలు శాంతిఅభివృద్ధి సాధించడంలో కష్టపడుతున్నాయి.

అదే సమయంలోగ్లోబల్ సౌత్ ఎదుగుతోందివారు కొత్తమరింత న్యాయమైన ప్రపంచ క్రమాన్ని చూడాలని కోరుకుంటున్నారుఐక్యరాజ్యసమితికి 75 సంవత్సరాలు నిండినప్పుడుఅభివృద్ధి చెందుతున్న దేశాలకు గొప్ప ఆశ ఉండేదిదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణలు నెరవేరుతాయనే ఆశ అదిఇప్పటికైనా వారి గళాలు వినిపిస్తాయనే ఆశకానీ ఆ ఆశ నిరాశగా మారిందిఅభివృద్ధి చెందుతున్న దేశాల గళం అంచులలోనే మిగిలిపోయిందిఈ అంతరాన్ని తగ్గించడానికి భారతదేశం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.

భారతదేశానికి మహా సాగర్ (అన్ని ప్రాంతాలలో భద్రతఅభివృద్ధి కోసం పరస్పర సమగ్ర పురోగతిఅనే దృక్పథం గ్లోబల్ సౌత్‌ కోసం మార్గదర్శకగా ఉందిమాకు అవకాశం వచ్చిన ప్రతిసారీగ్లోబల్ సౌత్‌ గళాన్ని వినిపించాం

మా జీ-20 అధ్యక్ష సమయంలోగ్లోబల్ సౌత్ ఆందోళనలను ప్రపంచ స్థాయి నిర్ణయాక ప్రక్రియకు కేంద్రంగా తీసుకొచ్చాంమహమ్మారి సమయంలోమా 140 కోట్లమంది ప్రజలను చూసుకుంటూనే, l 150కి పైగా దేశాలకు వ్యాక్సిన్లుమందులను అందించాంవిపత్తుల సమయంలోసహాయంఉపశమనంసంఘీభావంతో మేము తక్షణమే స్పందించాంమా అభివృద్ధి భాగస్వామ్యాలు అవసరాల ఆధారితమైనవిగౌరవప్రదమైనవిఇంకా ఎటువంటి షరతులు లేనివి.

గౌరవ సభ్యులారా

గ్లోబల్ సౌత్‌కు సరైన వేదికపై సరైన స్థానం కల్పించడానికి ఇది మనం కలిసి పనిచేయాల్సిన సమయంవాతావరణ న్యాయం జరిగేలా చూడాలితద్వారా వాతావరణ సంక్షోభానికి తక్కువగా దోహదపడిన వారిపై భారం పడదుఈ ప్రయత్నంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోను మేం ఒక ముఖ్యమైన భాగస్వామిగా భావిస్తున్నాం.

మిత్రులారా

మన రెండు దేశాలు పరిమాణంభౌగోళిక స్థానం పరంగా భిన్నంగా ఉండవచ్చుకానీ మన విలువలలో బలమైన ఐక్యత ఉందిమనవి గర్వించదగిన ప్రజాస్వామ్య దేశాలుచర్చలుసార్వభౌమత్వంబహుపాక్షిక వ్యవస్థమానవ గౌరవం అనే సూత్రాలపై మనకు విశ్వాసం ఉందిఈ సంఘర్షణల కాలంలోమనం ఈ విలువలకు కట్టుబడి ఉండాలి

ఉగ్రవాదం అనేది మానవత్వానికి శత్రువుఉగ్రవాదం తెచ్చిపెట్టిన గాయాలనుఅమాయక ప్రాణాలు బలి కావడాన్ని ఈ రెడ్ హౌస్ కూడా ప్రత్యక్షంగా చూసిందిఉగ్రవాదానికి ఎక్కడా స్థలంఆశ్రయం లభించకుండా మనం ఐక్యంగా నిలబడాలిఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా  పోరాటంలో మాకు తోడుగా నిలిచిన ఈ దేశ ప్రజలకుప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మిత్రులారా

మన పూర్వీకులు కష్టపడ్డారు... త్యాగాలు చేశారుభవిష్యత్ తరాలకు మెరుగైన జీవితాల కోసం కలలు కన్నారుభారతదేశంట్రినిడాడ్ అండ్  టొబాగో రెండూప్రజలకు వాగ్దానం చేసిన భవిష్యత్తు వైపు చాలా దూరం ప్రయాణించాయిఅయితే మనంతట మనంగాఇంకా కలిసి చాలా చేయాల్సింది చాలా ఉంది.

పార్లమెంటు సభ్యులుగా మీరందరూ ఆ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలిఅయోధ్య నుంచి అరిమా వరకుగంగా తీరాల నుంచి గల్ఫ్ ఆఫ్ పారియా వరకుమన బంధాలు మరింత లోతుగామన కలలు మరింత ఉన్నతంగా ఎదగాలి.

ఈ ఆలోచనలతో నా ప్రసంగాన్ని ముగిస్తాను.

మీరు చూపిన గౌరవాదరాలకు మీకు మరోసారి ధన్యవాదాలు

ధన్యవాదాలుచాలా ధన్యవాదాలు.

 

***


(Release ID: 2142473)