సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించం, నూతన సాంకేతిక పరిజ్ఞానాలను అమలుచేయడం, ఆధునిక టీవీ వీక్షణ అలవాట్లకు అనుగుణంగా ఉండడం కోసం టెలివిజన్ రేటింగ్‌ కొలమానంలోకి బహుళ ఏజెన్సీలను అనుమతించే ప్రక్రియలో తొలగిన అవరోధాలు


స్ట్రీమింగ్.. మొబైల్ వ్యూయర్‌షిప్‌ కొలమానంలో అంతరాలను తొలగిస్తూ, పాత రేటింగ్ విధానాన్ని సాంకేతికతో నవీకరించడం లక్ష్యంగా కొత్త టీఆర్‌పీ పాలసీ ముసాయిదా

ప్రజలు, సంబంధిత వ్యక్తుల అభిప్రాయాల కోసం 30 రోజుల పాటు వారికి అందుబాటులో ముసాయిదా టీఆర్‌పీ మార్గదర్శకాలు

Posted On: 03 JUL 2025 7:16PM by PIB Hyderabad

దేశంలో ఇటీవల టెలివిజన్ వీక్షణ అలవాట్లలో గణనీయమైన మార్పు వచ్చిందిప్రేక్షకులు ఇప్పుడు కేబుల్డీటీహెచ్ వేదికల ద్వారా మాత్రమే కాకుండా స్మార్ట్ టీవీలుమొబైల్ అప్లికేషన్లుఇతర ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వేదికల ద్వారా కూడా కార్యక్రమాలను చూస్తున్నారు. అయితే వీక్షకుల సంఖ్యను కొలిచేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెలివిజన్ రేటింగ్ పాయింట్ల (టీఆర్‌పీ) వ్యవస్థ.. రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న ఈ నమూనాలను పూర్తిగా సంగ్రహించలేదు.

అందువల్ల 2014లో జారీ చేసిన టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీల కోసం ఉద్దేశించిన విధానపరమైన మార్గదర్శకాల్లో పలు సవరణలను సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందిఈ నెల 2న విడుదలైన ప్రతిపాదిత ముసాయిదా ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న బీఏఆర్‌సీ మాత్రమే కాకుండా మరిన్ని సంస్థలను దేశంలోని టెలివిజన్ ప్రేక్షకుల కొలమాన రంగంలోకి అనుమతించేందుకు మీడియా సంస్థలకున్న అడ్డంకులు తొలగిపోతాయిఇది ఈ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యీకరిండానికీఆధునీకరించడానికీ ఉపయోగపడుతుంది.

ముసాయిదా జారీ చేసిన 30 రోజుల్లోపు సంబంధిత వ్యక్తులుప్రజలు తమ అభిప్రాయాలను తెలియపరచాలని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడంమరింత కచ్చితమైన.. ప్రాతినిధ్య డేటాను రూపొందించడందేశవ్యాప్తంగా వీక్షకుల వైవిధ్యమైనఅభివృద్ధి చెందుతున్న మీడియా వినియోగ అలవాట్లను సరిగ్గా సూచించేలా చేయడం ఈ ప్రతిపాదిత సంస్కరణల లక్ష్యం.

మరింత ప్రాతినిధ్యంతో కూడిన ఆధునిక టీఆర్‌పీ వ్యవస్థ అవసరం

దేశంలో ప్రస్తుతం దాదాపు 230 మిలియన్ల గృహాల్లో టెలివిజన్‌లు ఉన్నాయిప్రస్తుతం వీక్షకుల డేటాను సంగ్రహించేందుకు దాదాపు 58,000 మీటర్లు మాత్రమే ఉన్నాయిఇది టీవీలు ఉన్న మొత్తం గృహాల్లో కేవలం 0.025 శాతం మాత్రమేఈ పరిమిత శాంపిల్ సైజ్.. వివిధ ప్రాంతాలజనుల విస్తృత వీక్షణ ప్రాధాన్యాలను సరైన విధంగా సూచించకపోవచ్చు.

పైగా ప్రేక్షకులు అత్యధికంగా ఉపయోగిస్తున్న స్మార్ట్ టీవీలుస్ట్రీమింగ్ పరికరాలుమొబైల్ అప్లికేషన్‌ల వంటి అభివృద్ధి చెందుతున్న వేదికల వీక్షకుల సంఖ్యను ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రేక్షకుల కొలమాన సాంకేతికత సరిగ్గా సంగ్రహించలేదుఅభివృద్ధి చెందుతున్న వీక్షణ విధానాలుప్రస్తుత కొలమాన ప్రణాళికల మధ్య ఈ అంతరం రేటింగ్‌ల కచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తుందిఇది ప్రసారకర్తల ఆదాయ ప్రణాళికలనూబ్రాండ్‌ల ప్రచార వ్యూహాలనూ ప్రభావితం చేస్తుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో విస్తృతమైన మీడియా రంగంలోని సమకాలీన కంటెంట్ వినియోగ అలవాట్లను మెరుగ్గా ప్రతిబింబించేలా టెలివిజన్ రేటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముంది.

ప్రస్తుత టీఆర్‌పీ వ్యవస్థలోని ఇబ్బందులు

1.  బీఏఆర్‌సీ (బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్మాత్రమే ప్రస్తుతం టీవి రేటింగ్స్ అందిస్తోంది.

2. ఇది ప్రధాన ధోరణిగా ఉన్నప్పటికీ కనెక్టెడ్ టీవి పరికరాల వీక్షణను ఇది ట్రాక్ చేయదు.

3. ప్రస్తుత విధానాలు టీవీ రేటింగ్ రంగంలోకి కొత్త సంస్థలు ప్రవేశానికి అవరోధంగా ఉన్నాయి.

4. పరస్పర ప్రయోజన సంబంధిత పరిమితులు ప్రసారదారులుప్రచారకర్తలను రేటింగ్ ఏజెన్సీల్లో పెట్టుబడి పెట్టడానికి అనుమతించడం లేదు.

ప్రతిపాదనలు ఏమిటి

ఈ సమస్యలను పరిష్కరించడం కోసం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల కోసం కీలక సవరణలను ప్రతిపాదించింది:

  • కంపెనీ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (ఎమ్ఓఏ)లో కన్సల్టెన్సీ లేదా సలహా సేవలు వంటి ఏ అంశాన్నీ చేర్చకూడదన్న నిబంధన స్థానంలో... "కంపెనీ సలహాలు లేదా అటువంటి సలహా సేవలు వంటి ఏ కార్యకలాపాలను చేపట్టకూడదుపరస్పర ప్రయోజనానికి అవకాశం ఉన్న కారణంగా ఇది రేటింగ్ ఇచ్చే ప్రధాన లక్ష్యం విషయంలో రాజీపడేలా చేయవచ్చుఅనే సులభంగా పాటించగల నిబంధనను పేర్కొంటూ.. నిబంధన 1.4లో మార్పు చేసింది.

  • ఇతర సంస్థల ప్రవేశానికి అవరోధంగా ఉన్న ఇతర నిబంధనలనూ (1.5, 1.7) తొలగించాలని ప్రతిపాదించింది.

బహుళ ఏజెన్సీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడంకొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడంముఖ్యంగా కనెక్టెడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌ల కోసం మరింత విశ్వసనీయమైనప్రాతినిధ్య డేటాను అందించేందుకు అనుమతించడం ప్రతిపాదిత సవరణల లక్ష్యంవీక్షణ అలవాట్లు అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. మనం వాటిని కొలిచే విధానం కూడా అభివృద్ధి చెందాలిఈ సవరణలు రేటింగ్ టెక్నాలజీమౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ప్రసారకర్తలుప్రకటనదారులుఇతర వాటాదారుల నుంచి మరిన్ని పెట్టుబడులను కూడా అనుమతిస్తాయిఈ సంస్కరణల ద్వారా మరింత పారదర్శకమైనసమ్మిళితమైనసాంకేతికత ఆధారితమైన టీవీ రేటింగ్ వ్యవస్థను రూపొందించడం భారత్ లక్ష్యం.

మీ అభిప్రాయాన్ని పంచుకోండి

మీరు వీక్షకులుటీవీ యజమానులుప్రకటనదారులుసంబంధిత వ్యక్తులు అయితేనోటీసు విడుదలైన ఈ నెలాఖరులోగా మీ అభిప్రాయాన్ని sobpl-moib[at]nic[dot]in కు పంపవచ్చు.

అధికారిక ముసాయిదాలో సవరణలువిధానపరమైన మార్గదర్శకాల కోసంhttps://mib.gov.in/sites/default/files/2025-07/notice-seeking-comments-on-trp_0.pdf ని సందర్శించండి.


భారతదేశంలో టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీల కోసం విధానపరమైన మార్గదర్శకాలు (2014) మీరు ఇక్కడ పొందవచ్చుhttps://mib.gov.in/sites/default/files/2025-07/policy-guidelines-for-television-rating-agencies-in-india-dt-16.01.2014-1.pdf

 

***


(Release ID: 2142176)