ప్రధాన మంత్రి కార్యాలయం
ఘనా జాతీయ పురస్కారాన్ని అందుకున్న ప్రధానమంత్రి
Posted On:
03 JUL 2025 2:12AM by PIB Hyderabad
ఘనా జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞతకూ, ప్రపంచ స్థాయి నాయకత్వానికీ గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఘనా అధ్యక్షుడు డాక్టర్ జాన్ డ్రమానీ మహామా అందజేశారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయుల పక్షాన ప్రధానమంత్రి స్వీకరించారు. భారతదేశ యువత ఆకాంక్షలకూ, భారత్ సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు భిన్నత్వానికీ, అలాగే ఘనాకూ, భారత్కూ మధ్య గల చరిత్రాత్మక సంబంధాలకూ ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.
ఈ విశిష్ట సన్మానానికి గాను ఘనా ప్రజలకూ, ఘనా ప్రభుత్వానికీ ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, సంప్రదాయాలు ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉంటాయని ఆయన అన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మైత్రిని మరింత దృఢతరం చేయడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించాలన్న కొత్త బాధ్యతను తనకు అప్పగిస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఘనాలో తాను చేపట్టిన చరిత్రాత్మక పర్యటన భారత్-ఘనా సంబంధాలకు కొత్త వేగాన్ని అందిస్తుందన్న నమ్మకం తనకుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
***
(Release ID: 2141729)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam