ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాలు... రేపు న్యూఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 27 JUN 2025 5:06PM by PIB Hyderabad

ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాలను రేపు.. అంటే ఈ నెల 28న.. ఉదయం దాదాపు 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమం జైనులకు పూజనీయుడైన ఆధ్యాత్మిక నేత, సంఘ సంస్కర్త ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ 100వ జయంతి గౌరవార్థం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పొడవున నిర్వహించే జాతీయ నివాళి ఉత్సవానికి ప్రారంభ సూచక కానుంది. ఈ కార్యక్రమానికి భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్టు  సహకారాన్ని అందిస్తుంది. ఏడాది పాటు సాగే ఉత్సవంలో వివిధ సాంస్కృతిక, సాహిత్య, విద్యా, ఆధ్యాత్మిక ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ జీవనం, వారసత్వంలతో పాటు ఆయన సందేశాన్ని విస్తృ‌తంగా ప్రచారం చేయనున్నారు.
 
ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ జైన తత్త్వశాస్త్రంపైన, నీతిశాస్త్రంపైన 50 కన్నా ఎక్కువ పుస్తకాలు రాశారు. భారతదేశమంతటా ప్రాచీన ఆలయాల పునరుద్ధరణలో ప్రముఖ పాత్రను పోషించారు. అంతేకాదు, విద్యావ్యాప్తి కోసం ప్రత్యేకించి ప్రాకృతం, జైన తత్త్వశాస్త్రాలతో పాటు శాస్త్రీయ భాషలకు మరింత ఆదరణ లభించే దిశగా కృషి చేశారు.  

***


(Release ID: 2140516) Visitor Counter : 3