ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని శ్రీ పీ.వీ. నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి
Posted On:
28 JUN 2025 11:19AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాజీ ప్రధాని శ్రీ పీ.వీ. నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఆర్థిక, రాజకీయ పరివర్తనకు సంబంధించిన కీలక దశలో దేశానికి అభివృద్ధి మార్గాన్ని చూపిన ఆ మహనీయుని సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:
"శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను. మన దేశ అభివృద్ధికి కీలక దశలో చక్కని మార్గదర్శనం అందించిన ఆయన దార్శనిక నాయకత్వం పట్ల యావత్ భారతం కృతజ్ఞతతో ఉంది. ఆయన తన తెలివితేటలు, జ్ఞానం, పాండిత్యంతో అశేష జనాదరణ పొందారు."
(Release ID: 2140512)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam