మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు.. దీనికి సంబంధించిన తీర్మానానికి మంత్రిమండలి ఆమోదం

Posted On: 25 JUN 2025 4:10PM by PIB Hyderabad

ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని, దానివల్ల రాజ్యాంగ స్ఫూర్తికి కలిగిన నష్టాన్ని  ధైర్య, సాహసాలతో ఎదురొడ్డి నిలిచి ఎంతో మంది చేసిన త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారిని, వారి త్యాగాన్ని గౌరవించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తీర్మానించింది.  నవ్‌నిర్మాణ్ ఆందోళన్‌తో పాటు సంపూర్ణ క్రాంతి అభియాన్‌ను కూడా అణగదొక్కాలన్న భారీ ప్రయత్నంతో  1974లో విద్రోహాన్ని మొదలుపెట్టారు.

ఈ సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి, ఈ రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ క్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాజ్యాంగం హామీనిచ్చిన ప్రజాస్వామిక హక్కుల్ని కోల్పోయిన వారికి, ఆ కాలంలో ఊహకు అందని భయానక కృత్యాలను అనుభవించిన వారికి మంత్రివర్గ సమావేశంలో నివాళులు అర్పించారు. ఎమర్జెన్సీ నాటి దురాగతాలను అమిత ధైర్య, సాహసాలతో ప్రతిఘటించిన వారికి కేంద్ర మంత్రిమండలి శ్రద్ధాంజలి ఘటించింది.

ఈ సంవత్సరంతో ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)కు 50 ఏళ్లు పూర్తి అవనున్నాయి. అత్యవసర పరిస్థితి భారతదేశ చరిత్రలో ఒక మరచిపోలేని అధ్యాయం. ఆ కాలంలో రాజ్యాంగాన్ని కూలదోశారు. రిపబ్లిక్‌పైనా, భారత ప్రజాస్వామిక స్ఫూర్తి పైనా దాడి జరిగింది. సమాఖ్యవాదాన్ని బలహీనపరిచారు. ప్రాథమిక హక్కులను, మానవుల స్వేచ్ఛను లుప్తం చేయడంతో పాటు ఆత్మగౌరవాన్ని భంగపరిచారు.
 
భారతదేశ ప్రజలు భారతీయ రాజ్యాంగం పట్ల చెక్కుచెదరని విశ్వాసాన్ని కనబరచడాన్ని కొనసాగిస్తారని, దేశ ప్రజాస్వామ్య సిద్ధాంతాలంటే వారికి దృఢమైన మనోనిబ్బరం ఉందని కేంద్ర మంత్రివర్గం పునరుద్ఘాటించింది. నియంతృత్వ ధోరణులను ప్రతిఘటించడంతో పాటు మన రాజ్యాంగాన్ని , దాని ప్రజాస్వామిక యవనికను రక్షించడానికి బలంగా నిలబడ్డ వారందరి నుంచి ప్రేరణను పొందడం వయోవృద్ధులకు, యువతకు సమాన రీతిన ముఖ్యమైందని పేర్కొంది.

ప్రజాస్వామ్యానికి జననిగా మన దేశం రాజ్యాంగ విలువలను సంరక్షించే, కాపాడే, కాపలా కాసే ఓ ఉదాహరణలా నిలుస్తోంది.

రండి, ఒక దేశంగా, మనం మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ఉల్లేఖించుకున్న ప్రజాస్వామిక, సమాఖ్యవాద స్ఫూర్తిని పరిరక్షిస్తామనే మన సంకల్పాన్ని పునర్నవీకరించుకొందాం.

 

***


(Release ID: 2139714) Visitor Counter : 3