రాష్ట్రపతి సచివాలయం
'వింగ్స్ టు అవర్ హోప్స్'(ఆశావోం కి ఉడాన్) పుస్తకం రెండో సంపుటి తొలి ప్రతిని అందుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్,
సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
23 JUN 2025 6:52PM by PIB Hyderabad
సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్తో కలిసి రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్.. 'వింగ్స్ టు అవర్ హోప్స్' (ఆశావోం కి ఉడాన్) పుస్తకం రెండో సంపుటిని ఆవిష్కరించి తొలి ప్రతిని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రచురణల విభాగం డైరెక్టరేట్, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
'వింగ్స్ టు అవర్ హోప్స్' పుస్తకం రెండో సంపుటిని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్స్ విభాగం ప్రచురించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రెండో సంవత్సర పదవీకాలంలో చేసిన ప్రసంగాల నుంచి ఎంపిక చేసిన ప్రసంగాలతో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, ఇతర ప్రముఖుల సమక్షంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.
పుస్తకంలోని రెండో సంపుటిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాల నుంచి ఎంపిక చేసిన 51 ప్రసంగాలు ఉన్నాయి. వీటిని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాలు, విద్య ద్వారా సమగ్ర అభివృద్ధిని పెంపొందించడం, నిస్వార్థ సేవ కోసం కర్మయోగుల్లో స్ఫూర్తిని నింపడం, సాయుధ దళాలు - మన జాతికి గర్వకారణం, పౌరుల సాధికారతలో పాలన పాత్ర, అత్యుత్తమ విజయాలను గుర్తించడం, ప్రపంచ సంబంధాలను నిర్మించడం-బలోపేతం చేయడం, మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, వ్యవసాయంలో ఆవిష్కరణలు- భారత వృద్ధికి చోదకశక్తి, ప్రకృతితో మనం మమేకం కావడం, మహిళా సాధికారత-అవరోధాలను ఛేదించడం అనే 11 విభాగాలుగా వర్గీకరించారు.
***
(Release ID: 2139069)