సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
"బదల్తా భారత్ మేరా అనుభవ్": పోటీలో పాల్గొనాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పిలుపు.. మై గవ్ ద్వారా నిర్వహణ
అయిదు సృజనాత్మక పోటీలు – ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్, షార్ట్ ఏవీ, బ్లాగ్ భారత్, వికసిత భారత్ క్విజ్: జూలై 9తో ముగింపు
Posted On:
20 JUN 2025 5:21PM by PIB Hyderabad
‘బదల్తా భారత్ మేరా అనుభవ్’ కార్యక్రమం కింద వరుసగా నిర్వహిస్తున్న ప్రభావవంతమైన, సృజనాత్మక పోటీల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దేశ పౌరులను ఆహ్వానిస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ 11 ఏళ్ల దార్శనిక నిర్దేశకత్వం, అపూర్వమైన అభివృద్ధి, సమర్థమైన పాలనను చాటేలా మైగవ్ సహకారంతో దేశవ్యాప్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. వికసిత భారత్@2047 నేపథ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం.. వ్యక్తిగత అనుభవాలను పంచుకునేలా, శరవేగంగా భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును చాటేలా అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పిస్తోంది. క్షేత్రస్థాయి భాగస్వామ్యం నుంచి సృజనాత్మక ప్రదర్శనల వరకు.. భారతీయులంతా ఇందులో పాల్గొనేలా, స్ఫూర్తిని పొందేలా, తమ గళాన్ని వినిపించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మై గవ్ పోర్టలు ద్వారా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. జూలై 9న ఇవి ముగియనున్నాయి.

గత 11 సంవత్సరాలలో దేశంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను, వికసిత భారత్‌గా ఎదిగే దిశగా దేశం సాధించిన పురోగతిని చాటడం ఈ పోటీల లక్ష్యం. రైతు సంక్షేమం నుంచి నారీ శక్తి వరకు, జీవన సౌలభ్యం నుంచి సులభతర వాణిజ్యం వరకు, దేశమే ప్రథమం- జాతీయ భద్రత, విదేశాంగ విధానం నుంచి ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా భారత్ నిలవడం వరకు... అనేక ఇతివృత్తాలను ఈ పోటీల కోసం ఎంచుకోవచ్చు. పరిశోధకులు, వ్లాగర్లు, బ్లాగర్లు, ఇన్ఫ్లూయోన్సర్లు, ఉత్సాహవంతులైన కథకులు సహా భారత పౌరులంతా #BadaltaBharatMeraAnubhav అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించి ఈ పోటీల్లో పాల్గొని, మార్పు దిశగా ప్రయాణాన్ని తమదైన విశిష్ట శైలిలో ప్రదర్శించవచ్చు.
అయిదు సృజనాత్మక పోటీల వివరాలిలా ఉన్నాయి:
ఇన్స్టాగ్రామ్ రీల్ పోటీలు #BadaltaBharatMeraAnubhav
డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర భారత్, స్కిల్ ఇండియా వంటి ఇతివృత్తాలపై 30–60 సెకన్ల రీల్స్ రూపొందించేలా దేశంలోని సృజనకారులను ఇది ప్రోత్సహిస్తుంది.
బహుమతులు: విజేతకు రూ.50వేలు; రన్నరప్‌లుగా నిలిచినవారికి రూ.25,000, రూ.10,000; ఏడుగురికి రూ.5,000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు.
https://www.mygov.in/task/badalta-bharat-mera-anubhav-instagram-reel-contest/?target=inapp&type=task&nid=359974
యూట్యూబ్ షార్ట్స్ పోటీలు #BadaltaBharatMeraAnubhav
మారుతున్న భారత స్ఫూర్తిని ప్రతిబింబించేలా తమ జీవితాల్లోని మనఃపూర్వకమైన, స్ఫూర్తిదాయకమైన క్షణాలను పంచుకునేలా ఈ పోటీ దేశ పౌరులను ఆహ్వానిస్తోంది. కొత్త హంగులద్దుకున్న రైల్వే స్టేషన్‌ను సందర్శించడం కావచ్చు, స్థానిక కార్యక్రమం కావచ్చు, లేదా సాంస్కృతిక ఉత్సవాలైనా కావచ్చు – అన్ని అంశాలూ పోటీకి అర్హమైనవే.
బహుమతులు: విజేతకు రూ.50వేలు, రన్నరప్‌లుగా నిలిచినవారికి రూ.25,000, రూ. 10,000, ఏడుగురికి రూ. 5,000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు.
https://www.mygov.in/task/badalta-bharat-mera-anubhav-youtube-shorts-challenge/?target=inapp&type=task&nid=359963
బ్లాగ్భారత్ పోటీ: మార్పును వివరించండి: మార్పు దిశగా దేశ ప్రయాణంపై పరిశీలనలు, విశ్లేషణలను బ్లాగ్ రూపంలో (800–1200 పదాలు) రాయడానికి దేశంలోని రచయితలు, పాత్రికేయులు, విద్యార్థులు, ఆలోచనాపరులకు ఈ పోటీ ఓ మంచి అవకాశం.
విజేతకు రూ.50వేలు, రన్నరప్‌లుగా నిలిచినవారికి రూ.25,000, రూ. 10,000, ఏడుగురికి రూ. 5,000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు.
https://www.mygov.in/task/badalta-bharat-mera-anubhav-blog-writing-contest/
వికసిత భారత్ క్విజ్ 2025: భారత విధానపరమైన సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాధించిన విజయాలపై పౌరుల అవగాహనను పరీక్షించే పోటీ ఇది.
బహుమతులు: మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. లక్ష, ద్వితీయ, తృతీయ స్థానాలకు రూ.75,000, రూ.50,000, మరో 300 మంది విజేతలు ఒక్కొక్కరూ రూ.2,000, రూ. 1,000 చొప్పున అందుకుంటారు. పోటీలో పాల్గొన్న అందరికీ ధ్రువీకరణ పత్రాలు లభిస్తాయి.
https://quiz.mygov.in/quiz/viksit-bharat-2025-quiz/
సంక్షిప్త ఏవీ పోటీ – నవభారత విజయగాథ #BadaltaBharatMeraAnubhavమార్పు దిశగా దేశ ప్రస్థానానికి జీవం పోసే లఘు ఏవీ చిత్రాలను (10 నిమిషాల వరకు) రూపొందించేలా వర్ధమాన సినీ దర్శకులు, వీడియో ఎడిటర్లు, విద్యార్థులను ఈ పోటీ ఆహ్వానిస్తోంది. కథనం, డాక్యుమెంటరీ, లేదా సినిమాను తలపించే దృశ్యాలు... వేటితోనైనా ఏవీని రూపొందించవచ్చు.బహుమతులు: విజేతకు రూ.3 లక్షలు, రన్నరప్‌లకు రూ.2 లక్షలు, రూ.లక్ష, ప్రోత్సాహక బహుమతులకు ఎంపికైన ఇద్దరికి రూ. 20,000 చొప్పున అందిస్తారు.
https://www.mygov.in/task/short-av-challenge-story-new-india/?target=inapp&type=task&nid=360007
(Release ID: 2138969)
|