ఉప రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి
Posted On:
20 JUN 2025 11:40AM by PIB Hyderabad
భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధన్ఖడ్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఎక్స్’’ వేదికగా రాష్ట్రపతికి ఆయన అభినందనలు చెబుతూ...:
‘‘భారత రాష్ట్రపతి గౌరవనీయురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఓ సామాన్య కుటుంబం నుంచి మొదలై అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టే వరకూ జరిగిన ప్రయాణం… ఉన్నతమైన విలువలు, నిరాడంబరత, ఔన్నత్యానికీ ఉదాహరణ. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తోంది. ఎమ్మెల్యేగా, గవర్నర్ గా, ఇపుడు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు రాష్ట్రపతిగా సేవలు అందిస్తూ...ప్రతిసారీ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు. స్ఫూర్తిదాయకమైన వారసత్వానికి ఆమె ప్రతీక.
నిన్న రాష్ట్రపతి భవన్లో స్వయంగా ఆమెను అభినందించడం నాకు లభించిన గౌరవం. ఈ పుట్టిన రోజు పండగ ఆమెకు ఆరోగ్యాన్నీ, సుఖసంతోషాలనూ అందించాలనీ, ఈ దేశానికి ఆమె మరిన్ని సేవలు అందించే దిశగా దేవుడు ఆశీస్సులు అందించాలనీ కోరుకుంటున్నాను.’’
***
(Release ID: 2137922)