ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్రొయేషియా రిపబ్లిక్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 18 JUN 2025 11:58PM by PIB Hyderabad

క్రొయేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ జొరాన్ మిలనోవిచ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జాగ్రెబ్‌లో సమావేశమయ్యారు.

ద్వైపాక్షిక సంబంధాల్లో వివిధ అంశాలపై నేతలు ఇద్దరూ చర్చించారుప్రజాస్వామ్య విలువలుచట్ట బద్ధ పాలనఅంతర్జాతీయ శాంతి-స్థిరత్వాల పరిరక్షణ కోసం కృషిచేస్తూ ఉండాలన్న ఉమ్మడి లక్ష్యంతోపాటు రెండు దేశాల సన్నిహిత మైత్రీ సంబంధాలను ఇకపైనా కొనసాగించాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారుద్వైపాక్షిక సహకారంరక్షణఅంకుర సంస్థలుక్రీడలతో పాటు నవకల్పన వంటి సరికొత్త రంగాలకు కూడా విస్తరించినందుకు వారు తమ హర్షాన్ని వ్యక్తం చేశారుఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి క్రొయేషియా బలమైన మద్దతుతో పాటు సంఘీభావాన్ని తెలిపినందుకు అధ్యక్షుడు శ్రీ మిలనోవిచ్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు పలికారునేతలు అనేక వందల సంవత్సరాలుగా రెండు దేశాలను గట్టిగా పెనవేసి ఉంచుతున్న సన్నిహిత సాంస్కృతిక అనుబంధాన్ని గురించి కూడా చర్చించారు.

 

పరస్పర ప్రయోజనాలతో కూడిన ప్రాంతీయ అంశాలతో పాటు ప్రపంచ అంశాలను కూడా చర్చించారుభారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి కాలాల్లో విస్తరించిన విషయాన్ని వారు గమనించారుఇది భారత్-క్రొయేషియా సంబంధాలకు అనేక విధాలుగా విలువను జోడించగలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

 

భారత్క్రొయేషియా సంబంధాల పూర్తి శక్తియుక్తుల్ని సద్వినియోగపరచుకొనే దిశగా కలసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ‌


(रिलीज़ आईडी: 2137641) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam