ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III ను అందుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 16 JUN 2025 1:33PM by PIB Hyderabad

సైప్రస్‌లో ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III’’ను ఆ దేశ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టొడౌలిడెస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు.

ఈ సన్మానాన్ని 140 కోట్ల మంది భారతీయుల పక్షాన ప్రధానమంత్రి స్వీకరిస్తూసైప్రస్ అధ్యక్షునికీసైప్రస్ ప్రభుత్వానికీసైప్రస్ ప్రజలకూ తన హృదయపూర్వక కృత‌జ్ఞత‌లు తెలిపారుఈ అవార్డును ఉమ్మడి విలువలుపరస్పర విశ్వాసం పునాదులుగా నిలిచిన భారత్సైప్రస్‌ల దీర్ఘకాలిక స్నేహ సంబంధాలకు ప్రధానమంత్రి అంకితం చేశారుఈ పురస్కారం భారత్ యుగయుగాలుగా అనుసరిస్తూ వస్తున్నప్రపంచ శాంతికిప్రగతికి దారిదీపంగా ఉంటున్న ‘‘వసుధైవ కుటుంబకమ్’’ భావనకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

ఈ గౌరవం భారత్‌సైప్రస్‌‌ల భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికివిస్తరించడానికీ కట్టుబడి ఉండటమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఈ అవార్డు శాంతికీభద్రతకూసార్వభౌమత్వానికీప్రాదేశిక సమగ్రతకూసమృద్ధికీ ఇరు దేశాల తిరుగులేని నిబద్ధతకు ఒక ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు.

 

****


(रिलीज़ आईडी: 2136621) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Manipuri , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam