ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ మృతికి ప్రధాని నివాళి

Posted On: 13 JUN 2025 2:53PM by PIB Hyderabad

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా రాజ్యసభ ఎంపీగా, గుజరాత్ బీజేపీ అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా వివిధ బాధ్యతల్లో రూపానీ అందించిన సేవలను స్మరించుకున్నారు.

ఎక్స్ లో ప్రధాని పోస్టు:

‘‘శ్రీ విజయ్ భాయి రూపానీ కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించాను.

‘‘మన మధ్య విజయ్ భాయ్ లేకపోవడం ఊహించలేనిది. ఆయనతో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం మేమిద్దరం కలసి పనిచేశాం. విజయ్ భాయ్ చాలా వినయంతో ఉండేవారు. కష్టపడి పనిచేసేవారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన రీతిలో సేవలు అందించారు.’’

‘‘రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ అయినా, రాజ్యసభ ఎంపీగా, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగానైనా తాను నిర్వర్తించిన ప్రతి బాధ్యతలోనూ తన ప్రత్యేకతను చూపించారు.’’

‘‘విజయ్ భాయ్ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మేమిద్దరం విస్తృతంగా పనిచేశాం. గుజరాత్ వృద్ధిని, ముఖ్యంగా ‘‘జీవన సౌలభ్యాన్ని’’ పెంపొందించేందుకు ఎన్నో చర్యలు ఆయన తీసుకున్నారు. మా మధ్య జరిగిన చర్చలను ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’


(Release ID: 2136220) Visitor Counter : 4