ప్రధాన మంత్రి కార్యాలయం
స్వావలంబనను, ఆధునికీకరణను దృఢతరం చేస్తూ భారత్ రక్షణ రంగంలో గత 11 సంవత్సరాల్లో అపూర్వ వృద్ధి నమోదు... ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
10 JUN 2025 9:47AM by PIB Hyderabad
భారత్ రక్షణ రంగంలో గత 11 సంవత్సరాలలో అసాధారణ ప్రగతి చోటుచేసుకొందని, రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తుల తయారీలో ఆధునికీకరణపైన, స్వయంసమృద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు.
దేశ ప్రజల ఉమ్మడి సంకల్పాన్ని చూస్తే గర్వంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రక్షణ రంగంలో ఇండియాను మరింత స్వావలంబన యుక్త దేశంగా, సాంకేతికంగా తిరుగులేని శక్తిగా నిలిపేందుకు వారు అచంచల దృఢనిశ్చయాన్ని చాటుతున్నారని ఆయన అన్నారు.
ఎక్స్‌లో మైగవ్ఇండియా (MyGovIndia) పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘మన రక్షణ రంగంలో గడచిన 11 ఏళ్లలో ప్రధాన మార్పులు చోటుచేసుకొన్నాయి...ఈ రంగానికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేయడంలో ఆధునికీకరణపై దృష్టి సారిస్తూనే, మరో వైపు స్వావలంబనను సాధించడంపైన కూడా శ్రద్ధ తీసుకొంటున్నారు. భారత్‌ను మరింత దృఢమైందిగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని పూని, మన దేశ ప్రజలు ఎలా ఏకతాటిమీదకు వచ్చారో గమనించినప్పుడు సంతోషం కలుగుతోంది. #11YearsOfRakshaShakti’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2135302)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Nepali
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada