ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్ విదేశాంగ మంత్రులతో సమావేశమైన ప్రధానమంత్రి


ఈరోజు దిల్లీలో జరిగిన 4వ భారత్-మధ్యాసియాసమావేశం గురించి మోదీకి వివరించిన మంత్రులు

పరస్పర ఆర్థిక సంబంధాలు, అనుసంధానత, రక్షణ, భద్రతా సహకారం, అధునాతన సాంకేతికల్లో సహకారం కోసం తన ఆలోచనను పంచుకున్న ప్రధానమంత్రి

ఉమ్మడి ప్రాంతీయ, ప్రపంచ స్థాయి సవాళ్లను పరిష్కరించడంలో బలమైన భారత్, మధ్యాసియా భాగస్వామ్యం ఒక శక్తిగా పనిచేస్తుందన్న ప్రధాని

పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన మధ్యాసియా దేశాలు నాయకులు… సీమాంతర ఉగ్రవాదంపై పోరుకు మద్దతిస్తున్నట్లు ప్రకటన

రెండో భారత్, మధ్యాసియా శిఖరాగ్ర సమావేశానికి అన్ని మధ్యాసియా దేశాల నాయకులకు ఆహ్వానించిన ప్రధాని

Posted On: 06 JUN 2025 8:54PM by PIB Hyderabad

కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రులు ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

దిల్లీలో ఇవాళ జరిగిన 4వ భారత్-మధ్యాసియా సమావేశంలో జరిగిన సానుకూల, ఉత్పాదక చర్చల గురించి ఆయా దేశాలు మంత్రులు ప్రధానికి వివరించారు.

మధ్యాసియా దేశాలతో సంబంధాలు భారత్‌కు ఎల్లప్పుడూ కీలకమైన ప్రాధాన్యతగా ఉన్నాయని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. చారిత్రకంగా ఇరు ప్రాంతాలు మధ్య ఉన్న గట్టి సంబంధాలను పునాదిగా చేసుకుంటూ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయటం, అనుసంధానతను పెంచుకోవటం.. రక్షణ, భద్రతా సహకారం మెరుగుపరుచుకోవటం, అధునాతన సాంకేతికతల విషయంలో సమగ్ర సహకారంపై తన ఆలోచననను ప్రధాని మోదీ పంచుకున్నారు.

ప్రాంతీయ, ప్రపంచ స్థాయి సవాళ్లను ఎదుర్కోవడంలో బలోపేతమైన భారత్, మధ్యాసియా భాగస్వామ్యం ఒక శక్తిగా పనిచేస్తుందని ప్రధాని ప్రధానంగా పేర్కొన్నారు.  

పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని మధ్య ఆసియా దేశాల విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ చేస్తోన్న పోరాటానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

భారత్‌లో జరగనున్న రెండో భారత్, మధ్యాసియా శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి అన్ని మధ్యాసియా దేశాల నాయకులను ఆహ్వానించారు.

 

***


(Release ID: 2134726) Visitor Counter : 7