ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, ‘ఏక్ పేడ్ మాఁ కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మొక్కల పెంపకం కార్యక్రమానికి నేతృత్వం వహించనున్న ప్రధాని


• 700 కి.మీ. ఆరావళి శ్రేణిలో వనాలను పెంచడానికి ఉద్దేశించిన ‘అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టు’లో భాగంగా మొక్కలు నాటనున్న ప్రధానమంత్రి

• ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన సుస్థిర రవాణా కార్యక్రమంలో భాగంగా 200 విద్యుత్తు బస్సులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 04 JUN 2025 1:20PM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగాగురువారం (జూన్ 5ఉదయం 10.15 గంటలకు న్యూఢిల్లీ లోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో చేపట్టే మొక్కల పెంపకం కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించనున్నారుపర్యావరణ సంరక్షణహరిత ప్రధాన రవాణా సదుపాయాలు .. వీటి పట్ల భారత్ నిబద్దతను ప్రధాని పునరుద్ఘాటించనున్నారు.

ఏక్ పేడ్ మాకే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాంకార్యక్రమంలో భాగంగా ఒక మర్రి మొక్కను ప్రధాని నాటిదానికి నీళ్లు పోస్తారు. ‘అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టు’లో ఈ కార్యక్రమం ఒక భాగం కానుంది. 700 కి.మీపొడవున అలరారుతున్న అరావళీ పర్వత శ్రేణిని తిరిగి వనాలతో కళకళలాడేటట్టు చేయాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

ఈ ప్రాజెక్టు ఢిల్లీరాజస్థాన్హర్యానాలతో పాటు గుజరాత్ సహా నాలుగు రాష్ట్రాలలో 29 జిల్లాల్లో అరావళీ పర్వత శ్రేణి చుట్టుపక్కల కి.మీబఫర్ ఏరియాలో పచ్చదనాన్ని విస్తరించే ఒక ప్రముఖ కార్యక్రమంవనాలను పెంచడంపునర్వనీకరణజల వనరుల పునరుద్ధరణ మార్గాలను అనుసరిస్తూఅరావళీలో జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశంఈ ప్రాంతంలో నేల సారాన్నిజల లభ్యతనువాతావరణ ఆటుపోట్లను తట్టుకొనే స్థితినీ మెరుగుపరచడం కూడా ఈ ప్రాజెక్టు మరో ఉద్దేశంఈ ప్రాజెక్టు స్థానిక సముదాయాలకు ఉపాధి కల్పనఆదాయార్జన అవకాశాలను కల్పించి వారికి మేలు చేయనుంది.

ఢిల్లీ ప్రభుత్వం అమలుపరుస్తున్న సుస్థిరత ప్రాతిపదిక ప్రధానమైన రవాణా కార్యక్రమంలో భాగంగా 200 విద్యుత్తు బస్సులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారుఇది పట్టణ ప్రాంతంలో స్వచ్ఛత ప్రధానమైన రాకపోకలకు ప్రోత్సాహాన్ని అందించడం ఒక్కటే కాకుండా పర్యావరణ సమతుల్యత విషయంలో దేశ ప్రజల సామూహిక బాధ్యతకు కూడా సంకేతంగా నిలవనుంది.‌

 

***


(रिलीज़ आईडी: 2133996) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam