ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరాగ్వే అధ్యక్షునితో ప్రతినిధి వర్గ స్థాయి చర్చల సందర్భంగా ప్రధానమంత్రి ఆహ్వాన ప్రకటన

प्रविष्टि तिथि: 02 JUN 2025 3:55PM by PIB Hyderabad

ఎక్స్‌లెన్సీ,

మీతో పాటు మీ ప్రతినిధి వర్గానికి మేం చాలా స్నేహపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నాందక్షిణ అమెరికాలో పరాగ్వే ఒక ముఖ్య భాగస్వామ్య దేశంగా ఉందిభౌగోళికంగా చూస్తే మన దేశాలు వేరు కావచ్చుకానీ మనం ఒకే తరహా ప్రజాస్వామిక విలువలను పంచుకొంటున్నాంఅంతేకాక మన దేశాల ప్రజల అభ్యున్నతి పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకొంటున్నాం.

ఎక్స్‌లెన్సీ,

మీ పర్యటన నిజంగానే చరిత్రాత్మకంపరాగ్వే అధ్యక్షుడు భారత్‌ను సందర్శించడం ఇది రెండో సారి.

ఎక్స్‌లెన్సీ,

సీనియర్ మంత్రులతో పాటు ఒక బలమైన ప్రతినిధి వర్గంతో కలసి మీరు ఇక్కడకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నామీరు ఒక్క ఢిల్లీలోనే కాకుండా ముంబయిలోనూ పర్యటిస్తున్నారుఇది రెండు దేశాల మధ్య పటిష్ఠ సంబంధాలను నిర్మించుకోవాలనే మీ నిబద్ధతను చాటి చెబుతోందికలసి పనిచేయడం ద్వారామనం ఉమ్మడి వృద్ధితో పాటు సమృద్ధిని సాధించుకోవడం కోసం బాట వేయగలమని నేను నమ్ముతున్నా.

ఎక్స్‌లెన్సీ,

డిజిటల్ సాంకేతికతకీలక ఖనిజాలుఇంధనంవ్యవసాయంఆరోగ్య సంరక్షణరక్షణరైల్వేలుఅంతరిక్షంతో పాటు సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం.. ఈ తరహా రంగాల్లో సహకారానికి కొత్త కొత్త అవకాశాలు ఉన్నాయని మనం భావిస్తున్నాం.

ఎంఈఆర్‌సీఓఎస్‌యూఆర్ (MERCOSUR)తో మనం ఒక ప్రాధాన్యపూర్వక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాందానిని మరింత విస్తరించడానికి మనం కలసి పనిచేసే వీలు ఉంది.

ఎక్స్‌లెన్సీ,

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో భారత్పరాగ్వేలు ఏకతాటి మీద నిలిచాయిసైబర్‌ నేరాలువ్యవస్థీకృ‌త నేరాలతో పాటు మత్తుమందులను అక్రమంగా తరలించడం వంటి ఉమ్మడి సవాళ్లకు ఎదురొడ్డి పోరాడడంలో సహకరించుకోవడానికి ఎన్నో సంభావ్యతలు ఉన్నాయి.

ఎక్స్‌లెన్సీ,

గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల్లోవిడదీయలేని అంతర్భాగాలుగా భారత్పరాగ్వేలు ఉన్నాయిమన ఆశలుఆకాంక్షలే కాకుండా సవాళ్లు కూడా ఒకటేమరి ఈ కారణంగానే మనం ఈ సవాళ్లతో దీటుగా వ్యవహరించడానికి పరస్పర అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకోగలుగుతాం

కోవిడ్ మహమ్మారి కాలంలో ఇండియా తన టీకా మందులను పంచుకోవడం ద్వారా పరాగ్వేకు మద్దతును అందించగలిగినందుకు మేం సంతోషిస్తున్నాంమాకున్న మరిన్ని సామర్థ్యాలను పంచుకొంటూ ఇదే సహకార స్ఫూర్తిని ఇక ముందూ కొనసాగించాలని మేం భావిస్తున్నాం.

ఎక్స్‌లెన్సీ,

మీ పర్యటన మన సంబంధాల్లో సన్నిహిత సంబంధాలతో పాటుగా నమ్మకంవాణిజ్యం అనే స్తంభాలకు కొత్త బలాన్ని జోడించగలదని నేను విశ్వసిస్తున్నాఇది భారత్-లాటిన్ అమెరికా సంబంధాలకు కూడా సరికొత్త పార్శ్వాలను జత చేయగలుగుతుంది.

కిందటి ఏడాదిలో గయానాలో క్యారికామ్ శిఖరాగ్ర సదస్సుకు నేను హాజరయ్యామనం అనేక విషయాల్లో సహకారాన్ని పెంచుకోవడం గురించి చర్చించాంఈ రంగాలన్నింటిలో పరాగ్వేతో పాటు లాటిన్ అమెరికా దేశాలతో మనం కలసి పనిచేయవచ్చని నేను అనుకుంటున్నా.

మరోసారి భారత్‌ తరఫున మీకు స్నేహపూర్వక స్వాగతం పలుకుతున్నా.

గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం. ‌

 

***


(रिलीज़ आईडी: 2133330) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada