ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారతీయ బృందం బ్రహ్మాండమైన ప్రదర్శన: ప్రధానమంత్రి అభినందనలు
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                02 JUN 2025 3:01PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                దక్షిణ కొరియాలో ఇటీవల నిర్వహించిన 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొని బ్రహ్మాండమైన ప్రదర్శనను ఇచ్చిన భారతీయ దళాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘‘క్రీడాకారుల్లో ప్రతి ఒక్కరి కఠోర శ్రమ, దృఢ సంకల్పం అన్ని పోటీల్లో స్పష్టంగా కనిపించాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని  ఇలా  పోస్ట్ చేశారు :
‘‘దక్షిణ కొరియాలో ఇటీవల నిర్వహించిన 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో మన క్రీడాకారుల బృందం కనబరిచిన బ్రహ్మాండమైన ప్రదర్శనను చూసుకొని భారత్ గర్వపడుతోంది. క్రీడాకారుల్లో ప్రతి ఒక్కరి కఠోర శ్రమ, దృఢ సంకల్పం ఆటల పోటీల్లో స్పష్టంగా కనిపించాయి. క్రీడాకారులు వారి భావి ప్రయత్నాల్లోనూ రాణించాలని కోరుకుంటున్నాను.’’ 
                
                
                
                
                
                (Release ID: 2133286)
                Visitor Counter : 4
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali-TR 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati