ప్రధాన మంత్రి కార్యాలయం
జూన్ 2న న్యూఢిల్లీలో అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) 81వ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొననున్న ప్రధాని
• 42 సంవత్సరాల తరువాత భారత్‌లో ఐఏటీఏ వార్షిక సర్వసభ్య సమావేశం
• ప్రపంచ విమానయాన సీఈఓలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
01 JUN 2025 8:01PM by PIB Hyderabad
అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎమ్) సోమవారం (జూన్ 2న) సాయంత్రం సుమారు 5 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్నారు. ప్రపంచ శ్రేణి వైమానిక మౌలిక సదుపాయాల కల్పనను అభివృద్ధి చేయడంతో పాటు అనుసంధానాన్ని పెంచాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఏజీఎమ్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
ఐఏటీఏ 81వ ఏజీఎమ్‌తో పాటు ప్రపంచ వైమానిక రవాణా శిఖరాగ్ర సదస్సు (వరల్డ్ ఏర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్..డబ్ల్యూఏటీఎస్)ను జూన్ 1 నుంచి 3వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. భారత్‌లో కడపటి ఏజీఎమ్‌ను 42 సంవత్సరాల కిందట- 1983లో- నిర్వహించారు. ఈ సమావేశం ప్రపంచ విమానయాన పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులతో పాటు అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల ప్రతినిధులు సహా 1,600 మందికి పైగా ప్రతినిధులను ఈ ఏజీఎమ్ ఒక చోటుకు తీసుకు వచ్చింది.
విమానయాన పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రపంచ వైమానిక రవాణా శిఖరాగ్ర సదస్సు దృష్టిని కేంద్రీకరించనుంది. ఈ సమస్యల్లో విమానసంస్థల పరిశ్రమకు చెందిన ఆర్థిక అంశాలు, ఆకాశ మార్గ సంధానం, ఇంధన భద్రత, విమానయాన పరిశ్రమకు అవసరమయ్యే ఇంధనాన్ని దీర్ఘకాల ప్రాతిపదికన ఉత్పత్తి చేసుకోవడం, కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా చేపట్టాల్సిన చర్యలకు అవసరమయ్యే ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడం, నవకల్పనలు సహా ఇతర సమస్యలు చర్చకు రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే విమానయాన రంగ ప్రముఖులు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు విమానయాన రంగంలో భారత్ ఇప్పటి వరకు సాధించిన అసాధారణ మార్పుతో పాటు దేశ సామాజిక, ఆర్థిక ప్రగతికి ఈ రంగం అందించిన తోడ్పాటు గురించి కూడా అవగాహన చేసుకునే ఉంది.
***
(रिलीज़ आईडी: 2133239)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam