ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంపట్ల ప్రధాని సంతాపం


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం

Posted On: 18 MAY 2025 12:00PM by PIB Hyderabad

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణనష్టంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

‘‘హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం తీవ్ర వేదనకు గురిచేసింది. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

మృతుల కుటుంబీకులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారం అందిస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాం: ప్రధానమంత్రి’’

@narendramodi 

 

 

***

MJPS/VJ


(Release ID: 2129414)