హోం మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల కొండల్లో నిర్వహించిన నక్సల్ వ్యతిరేక దాడుల్లో గాయపడిన
భద్రతా సిబ్బందిని ఢిల్లీ ఎయిమ్స్‌లో పరామర్శించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
వాళ్ల ఆరోగ్యం గురించి వాకబు చేశాను.. దేశం వాళ్లను చూసి గర్విస్తోంది: హోం మంత్రి
పరాక్రమంతో నక్సలిజం జాడలను పూర్తిగా తుడిచేస్తున్న భద్రతా దళాలు
Posted On:
15 MAY 2025 7:38PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల కొండల్లో 31 మంది నక్సలైట్లను హతమార్చిన సమయంలో గాయపడి, ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్న భద్రతా సిబ్బందిని కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు పరామర్శించారు.
ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్టులో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు: "మన భద్రతా దళాలు శౌర్యంతో నక్సలిజం జాడలను పూర్తిగా తుడిచేస్తున్నాయి”. ఈరోజు, ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌ను సందర్శించి, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల కొండల్లో 31 మంది నక్సలైట్లను హతమార్చిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో గాయపడిన భద్రతా సిబ్బందిని కలిశాను. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. దేశం వారిపై నమ్మకం ఉంచిందని, వారిని చూసి గర్విస్తున్నదని వారితో చెప్పాను.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో 21 రోజుల పాటు మొక్కవోని ధైర్యంతో మన సైనికులు నిరంతర ఆపరేషన్ నిర్వహించి 31 మంది నక్సలైట్లను హతమార్చారని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ సైనికుల ధైర్య సాహసాలను చూసి దేశం మొత్తం గర్విస్తోందని ఆయన పేర్కొన్నారు.
***
(Release ID: 2128980)