ఆయుష్
azadi ka amrit mahotsav

ఇక ఏటా సెప్టెంబరు 23న ఆయుర్వేద దినోత్సవం‌

Posted On: 13 MAY 2025 6:11PM by PIB Hyderabad

ప్రపంచ స్థాయిలో వ్యాప్తిని పెంచడంతో పాటు నిర్వహణ తీరులో కచ్చితత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది... సెప్టెంబరు 23ను ప్రతి ఏటా ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహించుకోవాలని నిర్ధారించింది. ఈ ఏడాది మార్చి నెల 23న జారీ చేసిన ఒక గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మార్పును సూచించి, అమలులోకి తీసుకువచ్చారు. ఆయుర్వేద దినోత్సవాన్ని ఇంతకుముందు  ‘ధన్‌తేరస్’ నాడు జరుపుకొంటూ వచ్చారు. ధన్‌తేరస్ తారీఖు చంద్రమాన క్యాలెండరును అనుసరించి మారుతూ ఉంటుంది కాబట్టి, ఈ నిర్ణయాన్ని ఒక ముఖ్యమైన మార్పుగా చెప్పుకోవాలి.

శాస్త్రీయమైన, రుజువులపై ఆధారపడిన, సమగ్రమైన వైద్య చికిత్స పద్ధతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఆయుర్వేద దినోత్సవాన్ని పాటిస్తూ వస్తున్నారు. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణ, వెల్‌నెస్.. ఈ రెండు విషయాల్లో ఆయుర్వేద వైద్య చికిత్స పద్ధతి ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటివరకు, ఆయుర్వేద దినోత్సవాన్ని ధన్‌తేరస్‌తో పాటే జరిపేవారు. ఇది హిందూ నెల కార్తికంలో (సాధారణంగా అక్టోబరు లేదా నవంబరులో) వస్తుంది. ఏమైనా, ధన్‌తేరస్ తేదీ ప్రతి ఏడాదిలోనూ మారుతూ వచ్చేది. ఈ కారణంగా ఆయుర్వేద దినోత్సవం ఏ రోజున అనే అంశం ఖాయంగా ఉండడం లేదు.  

రాబోయే పది సంవత్సరాల్లో ధన్‌తేరస్ తేదీ అక్టోబరు 15 మొదలు నవంబరు 12 మధ్య చాలా మార్పులకు లోనవబోతోందని, దీంతో జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ నిర్వహణ సంబంధిత ఏర్పాట్లలో తార్కిక సవాళ్లు తప్పేలా లేవన్న సంగతిని కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుంది.

ఈ పరస్పర వైరుద్ధ్యాన్ని పరిష్కరించడానికి, జాతీయ-అంతర్జాతీయ ఉత్సవాలకు ఒక నిలకడతనం కలిగిన సందర్భాన్ని ఖరారు చేయడానికి తగిన సమంజసపూరిత ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ ఒక కమిటీని వేసింది. నిపుణుల బృందం నాలుగు తేదీలను ప్రతిపాదించింది. వాటిలో సెప్టెంబరు 23 మిగతా అన్నింటిలోకీ చక్కని ఎంపికగా ఉంది. ఆచరణసాధ్యంగా ఉండడం,  ప్రతీకాత్మక కోణం.. ఈ రెండు అంశాలను గమనించిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఎంపిక చేసిన సెప్టెంబరు 23 శరద్ రుతువులో సూర్యుడు భూమధ్య రేఖను దాటే సందర్భం... పగలు-రాత్రి దాదాపు సమంగా ఉండే(ఈక్వినాక్స్) రోజు ఇది. ఖగోళంలో చోటు చేసుకొనే ఈ ఘటన ప్రకృతిలో సమతుల్యతకు ప్రతీక. ఇది ఆయుర్వేద తత్వ దర్శనంతో చక్కగా సరిపోలుతోంది.  మనసు, శరీరం, ఆత్మ.. వీటి మధ్య సమతౌల్యాన్ని ఏర్పరచుకోవాలని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది., విశ్వంలో పొందికకు నిదర్శనంగా నిలిచే ఈక్వినాక్స్ ఆయుర్వేద సారాన్ని చాటిచెబుతోంది. ప్రకృతితో సమతూకాన్ని ఏర్పరుచుకొని మనిషి తన మనుగడ సాగించాలి... ఆయుర్వేదలో ముఖ్యాంశమూ ఇదే.

కొత్తగా నిర్ధారించిన తారీఖును వ్యక్తులు, ఆరోగ్య రంగాన్ని వృత్తిగా ఎంపిక చేసుకున్న నిపుణులు, విద్యబోధన సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములు స్వీకరించి, ఏటా సెప్టెంబరు 23న నిర్వహించే ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమాలలో చురుకుగా పాలుపంచుకోవాల్సిందిగా ఆయుష్ మంత్రిత్వ శాఖ విజ్ఞ‌ప్తి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య రంగ పురోగతిలో (న్యారేటివ్స్‌) ఆయుర్వేద మరింత విస్తృతిని సంతరించుకొనేటట్లు చూసే సందర్భంగానూ, నివారణ ప్రధానమైన, నిలకడతనంతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవల అందజేత వ్యవస్థగా ఆయుర్వేదకు ఉన్న కాలాతీత విలువను ప్రోత్సహించే సందర్భంగానూ ఈ మార్పును మంత్రిత్వ శాఖ పరిగణిస్తోంది.‌

 

***


(Release ID: 2128655)