పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
32 విమానాశ్రయాల తాత్కాలిక మూసివేత నిర్ణయం ఉపసంహరణ
Posted On:
12 MAY 2025 12:20PM by PIB Hyderabad
ఈనెల 15వ తేదీ ఉదయం 05:29 గంటల వరకు 32 విమానాశ్రయాల తాత్కాలిక మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంతో ఆయా విమానాశ్రయాల్లో పౌర విమానయాన కార్యకలాపాలు తక్షణం అందుబాటులోకి వచ్చాయి.
ప్రయాణీకులు నేరుగా విమానయాన సంస్థలను సంప్రదించి వారు ప్రయాణించే విమానాల తాజా స్థితిని తెలుసుకోవాలనీ అలాగే ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడం కోసం విమానయాన సంస్థల వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించడమైనది.
***
(Release ID: 2128300)
Visitor Counter : 2