WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్ కంటెంట్ సృజనకారులు, అనుబంధ సృజనకారులకూ ఒక శక్తిమంతమైన వేదిక: హిమేశ్ రేశమియా‌


• భారతీయ సంగీతంపై దృష్టిసారించిన వేవ్స్ 2025‌

 प्रविष्टि तिथि: 04 MAY 2025 5:46PM |   Location: PIB Hyderabad

‘‘సరికొత్త శిఖరాలకు భారతీయ సంగీతం’’ పేరుతో ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని వేవ్స్ 2025 శిఖరాగ్ర సదస్సులో మూడో రోజున నిర్వహించారుపరిశ్రమ దార్శనికులుమార్పులను తీసుకు వచ్చిన వారితో కూడిన ఒక ఉన్నత స్థాయి మండలి ఈ కార్యక్రమంలో పాల్గొందివారంతా భారతీయ సంగీతం ప్రపంచ స్థాయికి ఎదగడంతోపాటు రాబోయే కాలంలో లభించగల అవకాశాలపై చర్చించడానికి ఒక చోటికి చేరారు.
ఈ ప్రభావశీల కార్యక్రమంలో భారతీయ సంగీత పరిశ్రమతోపాటు అంతర్జాతీయ సంగీత పరిశ్రమకు చెందిన లబ్ధప్రతిష్ఠులు పాలుపంచుకున్నారుకళాకారులు ప్రావీణ్యాన్ని పెంచుకోవాలనీసంగీత వ్యాపారండిజిటల్ గ్రోత్అంతర్జాతీయ సహకారంపరిశ్రమలో నవకల్పనలు.. అన్న అంశాలపై తమ తమ ఆలోచనలను వెల్లడించారు.
కంటెంటును సృష్టించే వారికీవారితో కలిసి పనిచేసే వారికీ వేవ్స్ 2025 ఒక శక్తిమంతమైన వేదిక అని బాలీవుడ్‌ ప్రసిద్ధ సంగీత దర్శకుడుగాయకుడు- శ్రీ హిమేశ్ రేశమియా అభివర్ణించారుకొత్తగా వచ్చే వారు తమను తాము తీర్చిదిద్దుకోవడానికి అమితమైన శ్రద్ధ తీసుకోవాని ఆయన ప్రధానంగా చెప్పారువారు తమ మ్యూజిక్ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికీ తమతో అట్టిపెట్టుకోవాలి. దానిని ఎప్పటికప్పుడు మార్పులూచేర్పులు చేసుకుంటూ ఉండాని ఆయన సూచించారుఆయన తన నుభవాలను వివరిస్తూ... ఇదివరకు అవకాశాలు పరిమితంగా ఉండేవన్న సంగతిని ఒప్పుకొన్నారుప్రస్తుతం ఎదగాలని తపిస్తున్న కళాకారులకు ప్రతిభను చాటుకోవడానికి స్వతంత్ర వేదికలనూసామాజిక ప్రసార మాధ్యమాలనూ ఉపయోగించుకోవచ్చుని ఆయన చెప్పారు.  ఏమైనాఅన్నింటి కన్నా ముఖ్యకారణం సంగీతానికుండే నాణ్యతేననీఅది శ్రోతలతో సరైన విధంగా అనుసంధానం కావడంతోపాటు పరిశ్రమలో సొంత గుర్తింపును సంపాదించుకునేందుకు ఆకర్షణీయంగా, వినసొంపుగా ఉండాని ఆయన స్పష్టం చేశారు.  

 

ఆసియాతోపాటు ప్రపంచ సంగీత విపణుల్లో చోటు చేసుకుంటున్న నూతన పరిణామాలపై యూనివర్సల్ మ్యూజిక్ వైస్ ప్రెసిడెంటు శ్రీ క్వీ తియాగ్ తన దృష్టికోణాన్ని ఆవిష్కరించారుభారతీయ ప్రతిభావంతులను ప్రోత్సహించడానికీవారి సాఫల్యం కోసం ప్రపంచ మార్గాన్ని నిర్మించడానికీ యూనివర్సల్ మ్యూజిక్ ఎంత నిబద్దతతో ఉందో ఆయన చెప్పారుదీంతోపాటేభారత్‌లో మరింత మన్నిక కలిగినవిలువలకు పెద్దపీట వేసి ఆదరించే తరహా సంగీత శ్రోతాగణ సంస్కృతి పరిఢవిల్లాల్సిన అవసరాన్ని గురించి కూడా ఆయన ప్రధానంగా చెప్పారు.
అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంగీతాన్ని ప్రోత్సహించడంలోపదిలపరచడంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతోపాటు డేటా ఆధారిత వ్యూహాలు పోషించగల పాత్రను గురించి మ్యూజిక్ టెక్నాలజీకాపీరైట్ సంరక్షణ రంగంలో అగ్రగామిఐఎఫ్‌పీఐ (ఫోనోగ్రఫీ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ముఖ్య సాంకేతిక అధికారి డాక్టర్ రిచర్డ్ గూచ్ వివరించారు.  
ప్రపంచంలో అన్నింటి కన్నా పెద్దదైన మ్యూజిక్ పబ్లిషింగ్ కంపెనీల్లో ఒకటైన సోనీ మ్యూజిక్ పబ్లిషింగుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీ దిన్‌రాజ్ శెట్టి మాట్లాడుతూ... సంగీత హక్కుల నిర్వహణ విషయంలో తనకున్న లోతైన అవగాహనను వివరించారుభారతీయ గీత రచయితలూసంగీత దర్శకులూ నేటి స్ట్రీమింగ్ యుగంలో తమ వృత్తిలో ఏయే విధాలుగా మెరుగైన సంపాదనను ఆర్జించవచ్చో కూడా ఆయన తెలియజేశారు.
సారేగామా మేనేజింగ్ డైరెక్టరు శ్రీ విక్రమ్ మెహ్రా తన వంతుగా కళాకారులకుసంగీత కంపెనీలకు (లేబుల్స్మధ్య సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావించారుపరిశ్రమ వర్ధిల్లాలంటే ఈ రెండు పక్షాలకూ పరస్పర గౌరవం దక్కాలన్నారుకళాకారులకు వారి సృజన శక్తి రీత్యా విలువనివ్వాలనీమరో వైపు సంగీతంలో లేబుల్స్ పెడుతున్న పెట్టుబడులకుగాను వాటికి తగిన గుర్తింపు ఇవ్వాలని శ్రీ మెహ్రా అన్నారుఒక పటిష్ఠమైన సభ్యత్వ ఆధారిత విపణిఇబ్బందులు సృష్టించని ప్రభుత్వ విధానాలుపైరసీని అడ్డుకొనేందుకు కఠిన చర్యలు ఎంతయినా అవసరమని కూడా శ్రీ మెహ్రా ప్రధానంగా చెప్పారుపరిశ్రమకు పైరసీ పెద్ద ఎత్తున నష్టాల్ని కొనితెచ్చిందంటూ ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.
వార్నర్ మ్యూజిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరు శ్రీ జయ్ మెహతా భారతీయ సంగీత పరిశ్రమ భవిష్యత్తు విషయంలో తన దార్శనికతను పంచుకున్నారుదేశంలో వేగంగా దూసుకుపోతున్న జీడీపీదేశ సంగీత రంగంలో సాపేక్షంగా నిలకడగా ఉండిపోతున్న వృద్ధి .. వీటి నడుమ ఏర్పడ్డ అంతరాన్ని గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారుఆర్థిక విస్తరణ చోటు చేసుకున్నప్పటికీసంగీత పరిశ్రమ జోరును ప్రదర్శించడం లేదనీమానిటైజేషన్‌లోనూవినియోగదారు ప్రవర్తనలోనూ సవాళ్లే ఈ స్థితికి  కారణమన్నారుఏమైనప్పటికీకంటెంట్ నిజంగా ఆకర్షణీయంగా ఉండిఉన్నత నాణ్యతతో కూడుకొన్నదైతేనే  భారతీయ వినియోగదారులు ముందుకు వచ్చి ఆ కంటెంటును ఆదరించడానికి సిద్ధపడుతున్నారని శ్రీ మెహతా అభిప్రాయపడ్డారు. పరిశ్రమ పూర్తి సత్తాను వెలికితీయడానికి కొత్త కొత్త ప్రతిభావంతులను వెతికిపట్టుకొనిశైలిలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు భారతీయగ్లోబల్ సంగీత రంగాల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరచాలని స్పష్టం చేశారు.
నియంత్రణ రంగంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ ఫెర్నాండెజ్ భారత సంగీత పరిశ్రమకు సంబంధించిన విస్తృత అవలోకనాన్ని ఆవిష్కరించారుబలమైన పని విధానాలుహక్కుల సంరక్షణడిజిటల్ నవకల్పనలను తప్పక ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ స్కాట్ డీ మర్కాడో ఎంతో నేర్పుతో సమన్వయం చేశారుఈయన సంగీత రంగంలో గౌరవాన్విత ఔత్సాహిక పారిశ్రామికవేత్తగానే కాకుండా గ్లోబల్ కన్సల్టెంటుగా కూడా ఉన్నారుశ్రీ మర్కాడో లోతైన అవగాహనతో కూడిన ప్రశ్నలు వేస్తూప్రతి ఒక్క వక్తా తన విశిష్ట దృష్టికోణాలనూ, భివిష్యత్తు ఆలోచనలనూ వెల్లడించడానికి  తోడ్పడ్డారుసృజనశీలురు ముఖ్య పాత్రను పోషించాలని శ్రీ మర్కాడో స్పష్టం చేశారుపరిశ్రమలో నిజమైన కథానాయకులు కళాకారులేననీవారికి మద్దతివ్వడంతోపాటు సాధికారతను సంతరించడానికి అనువైన అనుబంధ విస్తారిత వ్యవస్థను తప్పక ఏర్పాటు చేయాలన్నారు.‌

సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆధికారికంగా తెలుసుకోవడానికి మమ్మల్ని ఫాలో కండి:

ఎక్స్‌లో :

https://x.com/WAVESummitIndia

https://x.com/MIB_India

https://x.com/PIB_India

https://x.com/PIBmumbai

ఇన్‌స్టాగ్రామ్‌లో :

https://www.instagram.com/wavesummitindia

https://www.instagram.com/mib_india

https://www.instagram.com/pibindia

 

* * *


रिलीज़ आईडी: 2126975   |   Visitor Counter: 26

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , Nepali , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Kannada