@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

భారత్‌లో షూటింగ్ కోసం ఏడాదిలోనే ఇండియా సినీ క్లబ్ (ఐసీహెచ్)కు వంద దరఖాస్తులు: పృథుల్ కుమార్, ఎండీ‌, ఎన్ఎఫ్‌డీసీ


“రాబోయే రోజుల్లో అనేక విదేశీ చిత్ర నిర్మాణ సంస్థలు భారత్‌కు రానున్నాయి”: భూమి పెడ్నేకర్

"ప్రముఖ చిత్రాల్లోని అనేక ప్రదేశాలు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా మారాయి": నితిన్ తేజ్ అహుజా, సీఈవో, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా

వేవ్స్ 2025 వేదికగా ‘లైట్స్, కెమెరా, డెస్టినేషన్! సినిమాల ద్వారా భారత బ్రాండింగ్’ అనే అంశంపై ప్యానెల్ చర్చ

 Posted On: 02 MAY 2025 10:09PM |   Location: PIB Hyderabad

 ఈరోజు ముంబయిలో వేవ్స్ 2025 వేదికగా 'లైట్స్కెమెరాడెస్టినేషన్సినిమాల ద్వారా భారత బ్రాండింగ్అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో నటి భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ “ఇది భారత్ అనుకూల సమయంఇది మొత్తం ప్రపంచానికి తెలిసిన విషయం” అని వ్యాఖ్యానించారు.

చర్చలో పాల్గొన్న ఇతర ప్యానెలిస్టుల్లో ఎన్ఎఫ్‌డీసీ జాయింట్ సెక్రటరీ ( అండ్ బీ)మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పృథుల్ కుమార్ప్రొడ్యూసర్స్ గిల్డ్ సీఈవో శ్రీ నితిన్ తేజ్ అహుజాగుజరాత్ ప్రభుత్వ కార్యదర్శి (పర్యాటకశ్రీ రాజేందర్ కుమార్ఐటీడీసీ ఎండీ ముగ్ధా సిన్హా ఉన్నారు.

సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకర్స్నిర్మాతలు భారత్‌లో సినిమా షూటింగ్‌లు నిర్వహించేలా ప్రోత్సహిస్తూషూటింగ్ నిర్వహణ ప్రక్రియను సులభతరం చేస్తోందని జాయింట్ సెక్రటరీ (ఐ అండ్ బీ)ఎన్ఎఫ్‌డీసీ ఎండీ శ్రీ పృథుల్ కుమార్ తెలిపారుభారత్‌లో సినిమాల చిత్రీకరణకు ఇది వన్-స్టాప్ గమ్యస్థానంగా ఉందనీఅలాగే సినిమా షూటింగ్ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఇది వివిధ రాష్ట్రాల పోర్టళ్లతో అనుసంధానం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారుఇది భారత్‌లో సినిమాల చిత్రీకరణను సులభతరం చేసే సింగిల్-విండో సౌకర్యంగాఅనుమతుల జారీ యంత్రాగంగా పనిచేస్తుంది. అలాగే సినిమా అనుకూల వ్యవస్థ రూపకల్పనకు ఇది ప్రయత్నిస్తుంది. మన దేశాన్ని సినిమా చిత్రీకరణల గమ్యస్థానంగా ప్రోత్సహిస్తుంది. 2023లో పెరిగిన ప్రోత్సాహకాల కారణంగా వ్యాపారం పది రెట్లు పెరిగింది. భారత్‌లో షూటింగ్ చేయడం కోసం ఈ పోర్టల్‌కు ఏడాది కాలంలోనే వందకు పైగా దరఖాస్తులు వచ్చాయిఈ ప్రోత్సాహకాలు విదేశీ ఫిల్మ్ మేకర్స్ కోసం భారత్‌ను ఆకర్షణీయమైన షూటింగ్ ప్రదేశంగా మార్చాయి.

రాబోయే రోజుల్లో అనేక విదేశీ నిర్మాణ సంస్థలు భారత్‌కు రానున్నాయని భూమి పడ్నేకర్ అన్నారు. "ప్రపంచంలోని అనేక ప్రాంతాల ప్రజలకు మా సినిమా వల్లే ముంబయి గురించి తెలిసిందిఅని ఆమె పేర్కొన్నారుభారత్‌లోని అనేక ప్రదేశాల్లో షూటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని తెలిపిన భూమి పడ్నేకర్"నా సినిమాల్లో చాలా వరకు మన సంస్కృతిమన దేశపు విలువలు కనిపిస్తాయిమా జాజ్బా... సినిమా పట్ల మాకు గల ప్రేమపని పట్ల మా తారాగణం నిబద్ధత సాటిలేనివిఅని ఆమె వ్యాఖ్యానించారు.

భారత చిత్ర పరిశ్రమను గురించి భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ... ఇప్పుడు సినిమా సెట్లలో పనిచేసే పురుషులుమహిళల సంఖ్య దాదాపు సమానంగా ఉంటోందన్నారుభారత్‌లో చిత్ర నిర్మాణంలోకి వస్తున్న ఉన్నత వర్గాల వారు మాత్రమే డబ్బులు సంపాదిస్తున్నారని ఆమె అన్నారు.

నితిన్ తేజ్ అహుజా మాట్లాడుతూ... ప్రముఖ భారతీయ చిత్రాల్లో చూపించిన అనేక ప్రదేశాలు ప్రస్తుతం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా మారాయన్నారుగుల్మార్గ్‌లోని 'బాబీబంగ్లాడీడీఎల్‌జే ద్వారా ప్రసిద్ధి చెందిన పంజాబ్‌లోని పసుపు ఆవాల పొలాలు, 'జబ్ వి మెట్'లో చూపించిన రాత్లాం నుంచి భటిండా వరకు సాగే రైలు ప్రయాణం, 'త్రీ ఇడియట్స్చిత్రంలోని సన్నివేశాలను చిత్రీకరించిన పాంగోంగ్ సరస్సు వంటివి దీనికి కొన్ని ఉదాహరణలు'దిల్ చాహ్తా హైవిడుదలైనప్పటి నుంచి భారత యువత స్నేహితులతో కలిసి గోవాలో పర్యటించడం మొదలైందని ఆయన పేర్కొన్నారు.

సినిమాల షూటింగ్ కోసం మన సంస్థలను ప్రారంభించడం గురించి దేశం ఆలోచించాలని ఐటీడీసీ ఎండీ ముగ్ధా సిన్హా అభిప్రాయపడ్డారుదేశంలో సినిమా నిర్మాణపర్యాటక రంగాలకు ఇది అత్యంత అనుకూలమైన సమయం అని ఆమె పేర్కొన్నారుగుజరాత్ ప్రభుత్వ (పర్యాటకకార్యదర్శి రాజేందర్ కుమార్ మాట్లాడుతూ.. గుజరాత్‌లో చిత్రీకరించిన చిత్రాల ద్వారా పర్యాటరంగాన్ని ప్రోత్సహించడానికి వాటి షూటింగ్ జరిగిన ప్రదేశాన్ని క్రెడిట్ లైన్లలో పేర్కొనడం వంటి గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారుసానుకూల విధాన నమూనాలుమంచి మౌలిక సదుపాయాలుషూటింగ్ కోసం అనుమతుల సౌలభ్యం కారణంగానే ఫిల్మ్ మేకర్స్ తమ రాష్ట్రానికి వస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ సమావేశానికి సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ ఫోరం వ్యవస్థాపకురాలు సుప్రియా సూరి సమన్వయకర్తగా వ్యవహరించారు.

 

* * *


Release ID: (Release ID: 2126557)   |   Visitor Counter: 17