WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్ 2025 లో భారత సృజనాత్మకత, సాంకేతిక శక్తి ప్రదర్శన


డిజిటల్ మీడియా రంగంలో భారత్ సామర్ధ్యాన్ని ప్రతిబింబం : కృత్రిమ మేధ, సోషల్ మీడియా, వాణిజ్య ప్రకటనలపై వేవ్స్ లో చర్చలు

 Posted On: 01 MAY 2025 9:24PM |   Location: PIB Hyderabad

ముంబయి లోని జియో వరల్డ్ సెంటర్ లో వేవ్స్ 2025 శిఖరాగ్ర సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. కథను చెప్పడంలో గొప్ప వారసత్వం, కంటెంట్ సృష్టితో గ్లోబల్ హబ్ గా మారే భారత్ సామర్థ్యాన్ని ప్రధాని మోదీ  తమ ప్రధానోపన్యాసంలో ప్రముఖంగా తెలిపారు. కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి అనేవి ‘ఆరెంజ్ ఎకానమీ’కి మూలాధారాలుగా మారాయని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. “ఇండియాలో సృష్టించండి, ప్రపంచానికి సృష్టించండి” అంటూ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృష్టికర్తలను  ఆహ్వానించారు.

స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేయడం ద్వారా భారతీయ సినిమా దిగ్గజాలకు ప్రధానమంత్రి నివాళులర్పించారు. భారతదేశంలోని ప్రతి వీధి, పర్వతం, నది చెప్పడానికి వేచి ఉన్న కథను కలిగి ఉన్నాయని పేర్కొంటూ, భారతదేశపు వైవిధ్యమైన కథనాలను అన్వేషించాలని ప్రపంచ సృష్టికర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి 100కి పైగా దేశాల నుంచి ప్రముఖులు పరిశ్రమ నాయకులూ, ప్రఖ్యాత కళాకారులూ పాల్గొన్నారు. భారతదేశం సృజనాత్మక రంగంలో ప్రధాన శక్తిగా ఆవిర్భవించే దిశలో ఇది ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2125725

కృత్రిమ మేధ, సృజనాత్మకత: భవిష్యత్ దిశను నిర్దేశిస్తున్న అడోబ్, ఎన్వీఐడీఏ  

అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ మాట్లాడుతూ, డిజిటల్ సాధనాలు, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృజనాత్మకతకు గ్లోబల్ హబ్ గా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. 100 మిలియన్లకు పైగా విషయ సృష్టికర్తలు, 500 మిలియన్ల ఓటీటీ వినియోగదారులతో, భారతదేశాన్ని "ప్రపంచంలోని తదుపరి సృజనాత్మక సూపర్ పవర్" గా నారాయణ్ అభివర్ణించారు. అడోబ్ ఫైర్ ఫ్లై ఏఐ నమూనాలను ఆయన ప్రదర్శించారు. నైతిక విలువలతో కూడిన కృత్రిమ మేధ, విషయ ప్రామాణికత,  సృష్టికర్తలకు గుర్తింపు ఇవన్నీ స్థిరమైన వృద్ధికి అత్యంత కీలకమని ఆయన ఉద్ఘాటించారు.

ఒక ఫైర్ సైడ్ చాట్ లో, న్వీఐడీఏకు చెందిన రిచర్డ్ కెర్రిస్, విశాల్ ధూపర్  కృత్రిమ మేధ సృజనాత్మక ప్రక్రియ లో ఎలా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందో చర్చించారు. విషయాన్ని సృష్టించడానికి, దానిని స్థానికంగా మార్చడానికి, ఒక స్థాయిలో వ్యక్తిగతం చేయడానికి వీలవుతోందని వారు వివరించారు.‘'భారత్ ఎప్పటి నుంచో ప్రతిభను ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు అది సంస్కృతిని కూడా ఎగుమతి చేయగలదు" అని కెర్రిస్ అన్నారు. ప్రాంతీయ స్వరాలను ప్రపంచానికి వినిపించేందుకు,  భారతదేశాన్ని కథనాల శక్తిగా మార్చడానికి కృత్రిమ మేధకు గల సామర్థ్యాన్ని ఆయన వివరించారు.


https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2125947

క్రియేటర్ ఎకానమీని బలోపేతం చేసేందుకు మరింత మద్దతు అందించనున్న యూట్యూబ్

భారత క్రియేటర్ ఎకానమీని బలోపేతం చేయడానికి యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ రూ .850 కోట్ల పెట్టుబడిని ప్రకటించారు. మిలియన్‌కు పైగా సబ్‌స్క్రైబర్లున్న 15,000కిపైగా భారతీయ ఛానళ్లను ఉదహరిస్తూ, భారతదేశ కథలను ప్రపంచానికి తీసుకెళ్లడంలో యూట్యూబ్ ప్రముఖ పాత్రను ఆయన వివరించారు. గ్లోబల్ క్రియేటర్లు మార్క్ రోబర్ గౌతమీ కవలే (స్లే పాయింట్) కూడా ఈ కార్యక్రమంలో ఆయనతో కలసి పాల్గొన్నారు. భారతదేశం కేవలం సంగీతం, చలనచిత్రాల్లో మాత్రమే ముందంజలో లేదని, ఇప్పుడు సృష్టికర్తల దేశంగా కూడా మారిందని ఆయన అన్నారు. ప్రాంతీయ భారతీయ కంటెంట్, సంస్కృతిలో సమ్మిళితం అయినప్పుడు విశ్వవ్యాప్త ఆకర్షణను ఎలా కలిగి ఉందో కవాలే వివరించారు. పంచుకున్నారు, కృత్రిమ మేధ ఆధారిత డబ్బింగ్, స్థానికీకరణ ద్వారా స్టెమ్ కంటెంట్ సరిహద్దులను దాటి ఎలా విస్తరిస్తుందో మార్క్ రోబర్ వివరించారు.

డబ్ల్యూపీపీ, వాణిజ్య ప్రకటనల పునరుజ్జీవనం

ప్రకటనల రంగం  ఒక ట్రిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాప్తిని డబ్ల్యూపీపీ సీఈఓ మార్క్ రీడ్ వివరించారు. ఇంకా అది ఏఐ ఆధారిత కథనాల వైపు ఎలా మారుతున్నదో వివరించారు. డబ్ల్యూపీపీ ఓపెన్ వీడియో ప్రొడక్షన్ ప్లాట్‌ఫామ్‌ను ఆయన ఆవిష్కరించారు. మోషన్ ఏఐ ని ఉపయోగించి హైపర్-పర్సనలైజ్డ్ కంటెంట్ ఎలా రూపొందించవచ్చో చూపించేందుకు షారుక్ ఖాన్‌తో రూపొందించిన ప్రచారాన్ని షేర్ చేశారు. “ ఏఐ సృజనాత్మకతను భర్తీ చేయడం లేదు—దాన్ని విస్తరిస్తోంది” అని మార్క్ రీడ్ చెప్పారు. నాణ్యతతో కూడిన ప్రకటనల లభ్యతను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఎంఎస్ఎంఈలు,  డిజిటల్ సాధనాల పాత్రను వివరించారు.

గ్లోబల్ భాగస్వామ్యం: యూకే-ఇండియా సాంస్కృతిక ఒప్పందం



బ్రిటన్ డిజిటల్, కల్చరల్, మీడియా, స్పోర్ట్ శాఖ సహాయ మంత్రి లిసా నాండీ తన కీలక ప్రసంగంలో, భారత్ - యూకే మధ్య సాంస్కృతిక సంబంధాల ప్రాముఖ్యతను వివరించారు. సినిమా, మ్యూజియాలు,  ప్రదర్శన కళల రంగాల్లో భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆమె ద్వైపాక్షిక సాంస్కృతిక సమాఖ్య ఒప్పందాన్ని ప్రకటించారు. “మాంచెస్టర్ నుంచి ముంబై వరకు, మనం తదుపరి తరం కథాకారులను ప్రోత్సహించాలి” అని ఆమె పిలుపునిచ్చారు. సోఫియా దులీప్ సింగ్ వంటి చారిత్రక ప్రముఖుల నుంచి ఆధునిక యూకే-ఇండియన్ సృష్టికర్తల విజయాలను ఆమె ఉదహరించారు.

ప్యానెల్ ముఖ్యాంశాలు: ఏఐ , సంస్కృతి,  ప్రభావం అంశాలపై సమగ్రంగా చర్చించిన రెండు ప్యానెళ్లు

ఇండియా ఎమ్ అండ్ ఇ @ 100: మీడియా, వినోద రంగాల భవిష్యత్ - ప్యానెల్ లో ఈరోస్ నౌ, జెట్సింథెసిస్,  గ్రూప్ఎమ్ నుంచి నాయకులు పాల్గొన్నారు. కృత్రిమ మేధ ఆధారిత ఐపీ సృష్టి, జెన్ జెడ్ వినియోగ విధానాలు పరిశ్రమను పునర్నిర్మిస్తున్న నాలుగో విప్లవాత్మక దశలో భారతదేశం ఉందని వారు చెప్పారు.

 

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2125886

యూట్యూబ్ కు చెందిన గౌతమ్ ఆనంద్ నిర్వహించిన 'ది బిజినెస్ ఆఫ్ ఇంపాక్ట్' కార్యక్రమంలో చెఫ్ రణ్వీర్ బ్రార్, చెస్ టాక్ జితేంద్ర అద్వానీ, జపనీస్ యూట్యూబర్ మాయో మురసాకి వంటి క్రియేటర్లు పాల్గొన్నారు. చదరంగం నుంచి వ్యవసాయం వరకు, సాంస్కృతిక ప్రామాణికతను పరిరక్షిస్తూ డిజిటల్ వేదికలు భారతీయ విజ్ఞానాన్ని ఎలా ప్రపంచవ్యాప్తం చేస్తున్నాయో వారు ప్రదర్శించారు.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2125889

 

***


Release ID: (Release ID: 2126326)   |   Visitor Counter: 13