WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఇన్ఫ్లుయెన్స్ బిజినెస్ : వేవ్స్ 2025లో కథలు, ఉత్సుకత, ప్రయోజనాల సమ్మేళనం


ముఖ్యమైన కథల ద్వారా సంస్కృతి, సమాజం, సంభాషణలను రూపొందిస్తున్న క్రియేటర్ల ప్రతిభను చాటిచెప్పిన వేవ్స్ 2025

 Posted On: 01 MAY 2025 7:21PM |   Location: PIB Hyderabad

అల్గారిథంను అధిగమించే పనితీరుఅభిరుచిని మెరుగుపరిచే కథలు ఉన్న ఈ కంటెంట్ ప్రపంచంలో ‘‘ది బిజినెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్క్రియేటర్స్ షేపింగ్ గ్లోబల్ కల్చర్’’ అనే అంశంపై వేవ్స్ 2025లో చర్చను నిర్వహించారుఇది ప్రామాణికతఆసక్తిసమాజాల శక్తిమంతమైన మేళవింపుతో తీర్చిదిద్దిన కాన్వాస్‌గా నిలిచిందిఈ కార్యక్రమానికి యూట్యూబ్ ఏపీఏసీ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ ఆనంద్ అనుసంధాన కర్తగా వ్యవహరించారుఈ చర్చలో అసాధారణ ప్రతిభావంతులైన నలుగురు క్రియేటర్లు పాల్గొన్నారువారు డిజిటల్ ప్రపంచ రూపురేఖలను ప్రయోజనకరంగా మార్చేందుకు ఉత్సాహంగా పనిచేస్తున్నారు.

వేవ్స్ ఆరంభ కార్యక్రమంలో బిలియన్ల మంది భారతీయుల స్వరాన్ని ప్రతిఫలించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను తెలియజేస్తూ.. ఈ కార్యక్రమాన్ని గౌతమ్ ఆనంద్ ప్రారంభించారువైవిధ్యభరితమైనఅవగాహనతో కూడినసరిహద్దులను దాటి విస్తరించే కథనాలను రూపొందిస్తున్న క్రియేటర్లను యూట్యూబ్‌కు హృదయంగా వర్ణించారు.

ప్రజాదరణ పొందిన ‘మేయో జపాన్’ ఛానల్ నిర్వహిస్తున్న జపాన్ క్రియేటర్ మేయో మురసాకీ పరిచయంతో ఈ చర్చ ప్రారంభమైందిఆమె హిందీని అనర్గళంగా మాట్లాడతారుహిందీ నేర్చుకోవడంభారత్‌లో ఏడాది గడిపిన అనుభవంతో తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబర్‌గా మారారుజపాన్ ప్రేక్షకులకు భారత్ గురించి వివరించడం తనకు ఎలా ఆనందాన్నిస్తుందోబాధ్యతాయుతంగా ఉండేలా తనను ఎలా మార్చిందో వివరించారు. ‘‘ఇతర దేశాల గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు’’ అని ఆమె అన్నారు. ‘‘నేను బాగా పరిశోధన చేస్తానుసాధారణంగా భారత్ గురించి విదేశాల్లో చూపించే విధానంలో కాకుండా.. అసలైన భారత్‌ను చూపించేందుకు ప్రయత్నిస్తాను’’ అని తెలిపారు.

పాకశాస్త్ర నిపుణుడుయూట్యూబ్ సంచలనం షెఫ్ రణ్‌వీర్ బ్రార్ వంటల్లో ‘మూమెంట్ ఆఫ్ ట్రూత్’ గురించి మాట్లాడారు. ‘‘ప్రజలు తమ ఆహారంలో ఆదివారాన్ని అన్వేషించాలి’’ అని తాను భావిస్తున్నట్లు తెలిపారుఅలాగే ఏదైనా బ్రాండ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకొనేటప్పుడు దాని ప్రామాణికతే ముఖ్యమని అన్నారు. ‘‘అనుంబంధమే ముందులావాదేవీలు తర్వాతఇదే నా విధానం’’ అని పేర్కొన్నారు.

వ్యవసాయాన్ని సులభతరం చేయడంసుస్థిరంగా మార్చడం గురించి ‘ఇండియన్ ఫార్మర్’ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఆకాశ్ జాదవ్ వివరించారునీటిపారుదలవ్యవసాయం గురించి ఆచరణాత్మక చిట్కాలను తన ఛానల్ అందిస్తుంది. ‘‘వ్యవసాయం మనం ఇష్టపడే అంశంఇది మట్టితో ముడిపడి ఉందిమనవారి కోసమే మనం సాగు చేస్తాం’’ అని అన్నారు. ‘‘టేబుల్‌పై శుభ్రమైన ఆహారంరైతుల సంక్షేమం’’ ఇదే ఆకాశ్ లక్ష్యం.

భారతీయుల ఇళ్లకు చదరంగం నిశ్శబ్దంగా ఎలా తిరిగి వస్తోందో ‘చెస్ టాక్’ని నిర్వహిస్తున్న జితేంద్ర అద్వానీ తెలిపారు. ‘‘చిన్నారులుతల్లిదండ్రులునానమ్మతాతయ్యలు అందరూ మళ్లీ చెస్ ఆడుతున్నారు’’ అని వివరించారుహాస్యంసరళత్వం ఆయన బోధనా విధానంలో కలగలసి ఉంటాయిఆటను మరింత ఆసక్తిగా మార్చడానికి క్రికెట్సంస్కృతికి సంబంధించిన అంశాలను ఉపయోగిస్తారు. ‘‘నేను చాలా సరళంగాప్రేమతో వివరిస్తాను’’ అని జితేంద్ర తెలిపారు.

అంతర్జాతీయంగా ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలపై కొనసాగిన ఈ చర్చలతో తమ కంటెంట్ భాషనుభౌగోళిక సరిహద్దులను ఎలా అధిగమించిందో క్రియేటర్లు వివరించారుకంటెంట్ హిందీలో ఉన్నప్పటికీ తన ప్రేక్షకుల్లో సింహభాగం విదేశీయులేనని ఆకాశ్ జాదవ్ తెలిపారు. ‘‘ఆహారం అందరినీ ఒక్కటి చేస్తుంది’’ అనే వాస్తవానికి ఇది నిదర్శనమని తెలిపారు. ‘‘చదరంగానికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ ఉంది’’ అని జితేంద్ర అన్నారు.

వివిధ రకాల బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నప్పుడు తమ ప్రామాణికతను ఎలా నిలబెట్టుకుంటారని క్రియేటర్లను గౌతమ్ ఆనంద్ ప్రశ్నించారు. ‘‘నేనెప్పుడూ నో అన్న పదంతోనే ప్రారంభిస్తాను’’ అని బ్రార్ తెలిపారు. ‘‘నేను పాటిస్తున్న విలువలకు అనుగుణంగా బ్రాండ్ ఉంటేనే ముందుకు వెళతాను’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ చర్చలో ఏఐ కూడా ప్రస్తావనకు వచ్చిందికంటెంట్ సంబంధించిన అంశాల రూపకల్పనకు ఏఐ సహకరిస్తుందనికొన్ని సందర్భాల్లో ప్రమాదకారిగానూ మారుతుందని మేయో మురసాకి అభిప్రాయపడ్డారుసబ్ టైటిళ్లుక్రియేటివ్ టూల్స్‌కు సంబంధించి ఏఐతో ప్రయోగాలు చేస్తూనే పనిలో మానవ ప్రమేయం ఉండాల్సిన అవసరం గురించి రణ్‌వీర్ బ్రార్జితేంద్రఆకాశ్ జాదవ్ మాట్లాడారు.

ప్రేక్షకుల్లో ఉన్న ఔత్సాహిక క్రియేటర్లకు ఎలాంటి సలహాలు ఇస్తారని అడిగినప్పుడు వక్తలు మనస్ఫూర్తిగా సమాధానమిచ్చారు. ‘‘అల్గారిథంను కాదు మీ కలలను అనుసరించండి’’ అని రణ్‌వీర్ బ్రార్ చెప్పారు. ‘‘నిలకడగాప్రామాణికంగా ఉండండిమీరు రూపొందించే అంశాన్ని అధిగమించి ఆలోచించండి’’ అని ఆకాశ్ జాదవ్ తెలిపారు. ‘‘మీకు ఇష్టమైన అంశంతోనే మీ ప్రయాణం మొదలుపెట్టండి’’ అని జితేంద్ర కోరారు. ‘‘మీరు నిజాయతీని అనుసరిస్తే.. మిగిలనవన్నీ మీ వెనకే వస్తాయి’’ అని మేయో మురసాకి తెలిపారు.

కార్యక్రమాన్ని ముగించే ముందు చర్చలో పాల్గొన్న వక్తలకుప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారుఇన్ఫ్లుయెన్స్ అంటే వైరల్ అవ్వడం మాత్రమే కాదని ఈ చర్చా కార్యక్రమం తెలియజేసిందిఇది స్వరాలుహృదయంప్రపంచంలో మార్పులు తీసుకురావడంనిజాయతీతో కూడిన కథలకు సంబంధించినది.

 

***


Release ID: (Release ID: 2126316)   |   Visitor Counter: 9