WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్-2025 వేదికగా భారత్ నేతృత్వంలో ప్రపంచ వినోద విప్లవం కోసం దార్శనికతను ఆవిష్కరించిన ముఖేశ్ అంబానీ

భారత్‌ను ప్రపంచానికి ఆశావహ సందేశంగా నిలపనున్న వేవ్స్: ముఖేశ్ అంబానీ
మీడియా-వినోదం భారత సాఫ్ట్ పవర్ మాత్రమే కాదు... ఇది భారత నిజమైన పవర్: అంబానీ

 Posted On: 01 MAY 2025 8:32PM |   Location: PIB Hyderabad

ఈరోజు ముంబయిలో ప్రారంభమైన మార్గదర్శక ప్రపంచ మీడియావినోద రంగాల శిఖరాగ్ర సమావేశం వేవ్స్ 2025లో కీలకోపన్యాసం చేస్తూ... "భారత్ కేవలం ఒక దేశం మాత్రమే కాదుఇది కథల నాగరికతఇక్కడ కథ చెప్పడం ఒక జీవన విధానంఅని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముఖేష్ అంబానీ అన్నారు.

ప్రఖ్యాత అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్‌ను ఉటంకిస్తూ.... శ్రీ అంబానీ భారతదేశాన్ని "మానవ జాతికి పుట్టినిల్లుగామానవ వాక్కుకు జన్మస్థలంగాచరిత్రకు తల్లిగాపురాణగాథలకు అమ్మమ్మగాసంప్రదాయాలకు ముత్తాతగాఅభివర్ణించారుకథ చెప్పడం భారతీయ జీవితాలతో ముడిపడి ఉందనీ, "మన అమూల్య ఇతిహాసాల నుంచి పౌరాణిక కథల వరకుకథ చెప్పడం మన వారసత్వంకంటెంట్‌దే ప్రధాన పాత్ర మంచి కథలు ఎల్లప్పుడూ అమ్ముడవుతుంటాయిఈ కాలాతీత సూత్రం ప్రపంచ వినోదానికి పునాదిఅని అన్నారు.

"భారత్ నుంచి తదుపరి ప్రపంచ వినోద విప్లవాన్ని నిర్మించడంగురించి ఉత్తేజకరంగాముందుచూపుతో ప్రసంగించిన అంబానీ... ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్రంగా భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారుఈ మార్పునకు ప్రేరణగా నిలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ఆయన ప్రశంసించారుఆ దిశలో వేవ్ సమ్మిట్‌ ఒక చారిత్రాత్మక ముందడుగని ప్రశంసించారు. "మీడియా వినోదం భారత సాఫ్ట్ పవర్ అని ప్రజలు అంటారు. నేను దానిని భారత నిజమైన శక్తి అంటానుఅని అంబానీ పేర్కొన్నారు. ప్రపంచ వినోదంలో మన దేశ సృజనాత్మకసాంస్కృతికసాంకేతిక బలాన్ని వేవ్స్ ప్రదర్శిస్తుందన్నారు.

సృజనాత్మకతను పునర్నిర్మించే రెండు టెక్టోనిక్ మార్పులైన భౌగోళిక-ఆర్థికసాంకేతికతలను ఆయన ప్రస్తావించారుప్రపంచ జనాభాలో 85 శాతం మంది నివసిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాల ఆర్థిక సామర్థ్యం పెరుగుతున్న కొద్దీకంటెంట్ సృష్టివినియోగంలో ఈ ప్రాంత పాత్ర కూడా పెరుగుతోందిఅదే సమయంలోకృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతలు కంటెంట్ సృష్టి నుంచి పంపిణీ వరకు వినోద రంగ వాల్యూ చెయిన్‌లోని ప్రతి దశలోనూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. “ఊహకుఅమలుకు మధ్య సరిహద్దులను ఏఐ చెరిపేస్తోందిఒక శతాబ్దం కిందట సినిమా కోసం మూకీ కెమెరా చేసిన దానికంటే నేడు వినోదం కోసం ఏఐ చేస్తున్నది మిలియన్ రెట్లు ఎక్కువ మార్పులు కలిగిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

భారత ప్రత్యేక బలాలను ప్రధానంగా ప్రస్తావిస్తూదేశం బలమైన కంటెంట్డైనమిక్ డెమోగ్రఫీసాంకేతిక నాయకత్వం అనే మూడు ప్రాథమిక ఆధారాలతో వినోద విప్లవానికి దేశం నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని అంబానీ అన్నారు. "భారత డిజిటల్ విప్లవం కేవలం ఒక స్థాయి కథ కాదుఇది ఆకాంక్షఆశయంపరివర్తనల కథఅని ఆయన ప్రకటించారు.

పోలరైజ్డ్అనిశ్చిత ప్రపంచంలోప్రజలు ఆనందంసంబంధంప్రేరణను కోరుకుంటారుప్రపంచ వినోద ఆకాంక్షలను భారత్ నెరవేరుస్తుందిభారత్‌ను ప్రపంచానికి ఆశావహ సందేశంగా వేవ్స్ నిలపనుంది.” అంటూ అంబానీ తన కీలక ప్రసంగాన్ని ముగించారు.

 

 ***


Release ID: 2126013   |   Visitor Counter: 32