సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ - వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సదస్సు తొలి ఎడిషన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభం
వేవ్స్ 2025 కు ఆతిథ్యమివ్వడానికి ముంబయి సిద్ధం
భారత, ప్రపంచ మీడియా, వినోద రంగాల భాగస్వాముల మధ్య
నాలుగు రోజులపాటు కొనసాగనున్న విజ్ఞాన వినిమయం, చర్చలు, సహకారం
భారత సృజనాత్మక ఆర్థికవ్యవస్థలో పెనుమార్పులు సృష్టించనున్న వేవ్స్
Posted On:
30 APR 2025 4:46PM
|
Location:
PIB Hyderabad
మీడియా, వినోద రంగాలలో నూతన అధ్యాయంగా పరిగణిస్తున్న వేవ్స్ శిఖరాగ్ర సదస్సుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో రేపు ప్రారంభమయ్యే ఈ చరిత్రాత్మక నాలుగు రోజుల సదస్సు భారత మీడియా, వినోద పరిశ్రమను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశ వినోద రాజధానిగా పేరుగాంచిన ముంబయి మీడియా, వినోద రంగాలకు చెందిన ప్రముఖులకు ఆతిథ్యమివ్వడానికి సిద్ధమయింది. ఈ నాలుగు రోజుల సదస్సులో ఆసక్తికరమైన ప్యానెల్ చర్చలు, ఆలోచనలకు తావిచ్చే ప్రేరణాత్మక ఉపన్యాసాలు, విజ్ఞాన వినిమయం, ‘ఇన్-కన్వర్సేషన్’ సెషన్లు, అలాగే ఈ రంగాల ప్రముఖుల ద్వారా విలువైన మాస్టర్‌క్లాసులు వంటి అనేక అంశాలు ఉండబోతున్నాయి. ఈ రంగాల భాగస్వాములకు ఈ బహుముఖ ప్రయోజనాలు భారతదేశంలో మీడియా, వినోద రంగాల ఉజ్వల భవిష్యత్‌కు హామీ ఇస్తాయి.
వేవ్స్ సదస్సును భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. ప్రారంభ ఏడాదిలోనే వేవ్స్ సదస్సు భారత సృజనాత్మక రంగం ఘనతను, ప్రపంచ మీడియా, వినోద రంగంలో తనకున్న అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక వేదికగా నిలవనుంది. భారత, అంతర్జాతీయ భాగస్వాముల మధ్య విజ్ఞాన వినిమయం, సంభాషణలు, భాగస్వామ్యాన్ని కూడా వేవ్స్ మరింత ప్రోత్సహించనుంది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ మార్గదర్శక కార్యక్రమం ప్రపంచ శాంతి కోసం భారతదేశంలోని ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రయోజనకరంగా వినియోగించేందుకు, సృజనాత్మక ఆర్థికవ్యవస్థను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు రూపుదిద్దుకుంది.
వేవ్స్ నాలుగు స్థంభాలు
మీడియా, వినోద రంగాలను సమగ్రంగా కవర్ చేస్తూ, ఈ మహా ఈవెంట్‌ను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు.
ఒకటి: బ్రాడ్‌కాస్టింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ – సమాచారం, వినోదాన్ని అందించే సంప్రదాయ, అభివృద్ధి చెందుతున్న దశలను సమగ్రంగా ఆవిష్కరిస్తూ, ఈ ప్రధాన భాగం సమాచారానికి ప్రాధాన్యత ఇవ్వడం, పౌరులను సాధికారం చేయడం, 21 వ శతాబ్దం సవాళ్లకు అనుగుణంగా ప్రపంచస్థాయికి చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ కు సంబంధించిన ఈ క్రింది అంశాలను కలిగి ఉంటుంది
బ్రాడ్‌కాస్ట్: టెలివిజన్, రేడియో, పోడ్కాస్ట్‌లు, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్
కంటెంట్ సృష్టి: ప్రింట్ మీడియా, సంగీతం
డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్: క్యారేజ్ (కేబుల్ అండ్ శాటెలైట్), డిటిహెచ్ (డైరెక్ట్-టు-హోం)
అడ్వర్టైజింగ్, మార్కెటింగ్: మీడియా, వినోద రంగంలో బ్రాండ్ వ్యూహాలను రూపుదిద్దనున్న సృజనాత్మక నిపుణులు
రెండు: ఏవీజీసీ-ఎక్స్ఆర్ – ఈ విభాగం కళాత్మకత, వినోదం, సాంకేతికతల కలయికతో కథ చెప్పడంలో, ముఖాముఖీ అనుభవంతో ఆధునిక ప్రపంచాన్ని అన్వేషిస్తుంది. ఇది క్రింది ప్రత్యేక రంగాలను కలిగి ఉంటుంది:
మూడు: డిజిటల్ మీడియా, ఇన్నోవేషన్: ఈ విభాగం నిరంతరం మారుతున్న డిజిటల్ ప్రపంచాన్ని, వినోదాన్ని వినియోగించే విధానంపై దాని ప్రభావాన్ని పరిశీలిస్తుంది. ఇందులో కిందివి ఉన్నాయి.
.* డిజిటల్ మీడియా అండ్ యాప్ ఎకానమీ
• ఓటీటీ వేదికలు
• సోషల్ మీడియా వేదికలు
• జనరేటివ్ ఎఐ, అభివృద్ధిలో ఉన్న సాంకేతికత
• ఇన్‌ఫ్లుయన్సర్లు , కంటెంట్ క్రియేటర్లు
నాలుగు: చిత్రాలు: ఈ విభాగం చలనచిత్రం, నిర్మాణం, ప్రపంచీకరణ రంగాన్ని అన్వేషిస్తుంది.
-
సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు
-
ఫిల్మ్ టెక్నాలజీ (షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్)
-
భారతీయ సినీమా గ్లోబలైజేషన్
-
కో-ప్రొడక్షన్
-
ఫిల్మ్ ప్రోత్సాహకాలు
-
ఆడియో-విజువల్ సర్వీసులు
క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్, క్రియేటోస్ఫియర్: వేవ్స్ లో భాగంగా ప్రారంభించిన క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ (సిఐసి) సీజన్-1, 85,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లతో ఓ ముఖ్యమైన విజయాన్ని అందుకుంది. ఇందులో 1,100 మంది విదేశీయులు కూడా ఉన్నారు. 32 విభిన్న పోటీల నుంచి ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ తర్వాత 750 మందికిపైగా ఫైనలిస్టులను ఎంపిక చేశారు. ప్రతిభావంతులైన ఈ సృజనాత్మక మేధావులకు క్రియేటోస్ఫియర్లో తమ వ్యక్తిగతప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించే ప్రత్యేక అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, వారి రంగాలకు చెందిన వ్యాపార నాయకులతో నెట్‌వర్కింగ్, తమ ఆలోచనలు పంచుకునే పిచ్ సెషన్లు, అలాగే ప్రపంచ స్థాయి నిపుణుల నుంచి మాస్టర్‌క్లాసులు, ప్యానెల్ చర్చల ద్వారా అభ్యసించే అవకాశాలు ఉంటాయి.
వేవ్స్ లోని క్రియోటోస్పియర్ మాస్టర్ క్లాస్ లు, వర్క్ షాప్ లు, గేమింగ్ భాగం క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ ల గ్రాండ్ ఫినాలేతో అద్భుతమైన అనుభవాలను అందిస్తుంది, ఇది వేవ్స్ సిఐసి అవార్డులతో ముగుస్తుంది.
మే 2, 2025 న వేవ్స్ లో జరగనున్న గ్లోబల్ మీడియా డైలాగ్, అంతర్జాతీయ సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు, నైతిక విలువలపై దృష్టి సారించి ఆడియో-విజువల్, ఎంటర్టైన్మెంట్ రంగాల భవిష్యత్తును రూపొందించే లక్ష్యంతో నిర్మాణాత్మక, విలక్షణ సంభాషణలో పాల్గొనడానికి ప్రపంచ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమభాగస్వాములు, మీడియా నిపుణులు, కళాకారులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉద్దేశించిన మరో విభాగం.
ఆలోచనాపరుల సంభాషణల విభాగంలో ప్లీనరీ సెషన్లు, కాన్ఫరెన్స్ సెషన్లు, బ్రేక్అవుట్ సెషన్ల ద్వారా, ప్రముఖ సిఇఒలు, ప్రపంచ స్థాయి నాయకులు తమ ఆలోచనలను, విభిన్న దృక్పథాలను అందిస్తారు, అదే సమయంలో భాగస్వామ్యాల కోసం వ్యూహాత్మక చర్చలు కూడా జరగనున్నాయి.
వేవ్ఎక్సిలరేటర్ మెంటర్లు, పెట్టుబడిదారులతో లైవ్ పిచింగ్ సెషన్ల ద్వారా మీడియా, వినోద రంగానికి చెందిన స్టార్టప్‌లను కలిపే ఒక వేదికగా పనిచేస్తుంది. ఇది భారతీయ స్టార్టప్‌లు ఈ రంగంలో మార్పుకు నేతృత్వం వహించేలా ప్రోత్సహిస్తూ, సరైన పరిచయం, పెట్టుబడి అందేలా దోహదపడుతుంది.
వేవ్స్ బజార్ మీడియా, వినోద రంగానికి చెందిన ప్రధాన మార్కెట్ స్థలం. ఇది చలనచిత్ర నిర్మాతలు, పరిశ్రమ నిపుణులకు కొనుగోలుదారులు, అమ్మకందారులతో పాటు విస్తృత శ్రేణి ప్రాజెక్టులు ప్రొఫైల్స్ తో నిమగ్నమయ్యే అవకాశాన్ని అందిస్తుంది. వ్యూయింగ్ రూమ్ వేవ్స్ బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశం, ఇది 2025 మే 1 నుండి 4 వరకు అందుబాటులో ఉంటుంది. మొట్టమొదటి వేవ్స్ బజార్‌లో భాగంగా, భారత్, శ్రీలంక, అమెరికా, స్విట్జర్లాండ్, బల్గేరియా, జర్మనీ, మారిషస్, యుఎఈ వంటి 8 దేశాలకు చెందిన మొత్తం 100 సినిమాలు వ్యూయింగ్ రూమ్ లైబ్రరీలో వీక్షించేందుకు అందుబాటులో ఉంటాయి.
భారత్ పెవిలియన్: “కళ నుండి కోడ్ వరకు” అనే ఇతివృత్తం ఆధారంగా భారత్ వసుధైక కుటుంబం’ భావనను వేడుకగా నిర్వహించనుంది. భారతదేశ కళా సంప్రదాయాలు ఎన్నాళ్లుగానో సృజనాత్మకత, సమగ్రత, సాంస్కృతిక దౌత్యానికి ప్రతీకగా ఎలా నిలిచాయో ఇందులో ప్రదర్శిస్తారు. భారత్ పెవిలియన్ ప్రధాన భాగంలో నాలుగు అనుభవాత్మక విభాగాలు- శ్రుతి, కృతి, దృష్టి, క్రియేటర్స్ లీప్ - సందర్శకులను భారతదేశ కథా సంప్రదాయాల నిరంతర ప్రయాణంలో నడిపిస్తాయి.
ఎగ్జిబిషన్ పెవిలియన్: ఊహాశక్తి ఆవిష్కరణతో కలసే విలక్షణ ప్రదర్శన. ఆధునిక సాంకేతికత నుంచి భవిష్యత్తు ధోరణుల వరకు, ఇది మీడియా, వినోద రంగంలో భారతీయ, ప్రపంచ పురోగతిని ప్రదర్శిస్తుంది.
వేవ్స్ లో భాగంగా సామాజిక రేడియోపై జాతీయ సమ్మేళనం కూడా జరుగుతుంది. ఇది సామాజిక రేడియో అనే శక్తిమంతమైన వేదిక ద్వారా స్థానిక సమాజంతో నిబద్ధతను బలోపేతం చేయడానికి అవసరమైన నూతన ధోరణులు, విధానాలు, కార్యక్రమాలపై చర్చించి, వాటి ప్రాధాన్యతను వివరిస్తుంది.
వేవ్స్ కల్చరల్స్‌లో భారతీయ, అంతర్జాతీయ ప్రతిభను కలిపిన వివిధ ప్రదర్శనలు, కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఈవెంట్, సాంస్కృతిక మార్పిడిని ఐక్యతను ప్రోత్సహించడంలో మీడియా, వినోద రంగాల రూపాంతర శక్తిని గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
అందుచేత, మీరు పరిశ్రమ నిపుణులైనా, పెట్టుబడిదారులైనా, సృష్టికర్తలైనా, ఆవిష్కర్తలైనా—ఈ సదస్సు మొదటి సంచిక మీరు చిత్రనిర్మాణం, వినోద రంగాలకు కనెక్ట్ కావడానికి, కలసి పనిచేసేందుకు, ఆవిష్కరించేందుకు, మీడియా, వినోద రంగానికి సహకరించేందుకు అత్యుత్తమ అంతర్జాతీయ వేదికను అందిస్తుంది.
వేవ్స్ భారతదేశ సృజనాత్మక శక్తిని ప్రపంచానికి చాటేందుకు సిద్ధంగా ఉంది. కంటెంట్ సృష్టి, మేధోపరమైన ఆస్తి సాంకేతిక ఆవిష్కరణలో దేశాన్ని గ్లోబల్ హబ్‌గా ఆవిష్కరించేందుకు సన్నద్ధమైంది. బ్రాడ్‌కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్, మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), వర్చువల్ రియాలిటీ(విఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) మొదలైనవి ఈ సదస్సుకు ప్రాధాన్యతా రంగాలుగా ఉన్నాయి.
వివరాల కోసం సందర్శించండి https://wavesindia.org/
సదస్సు 4-రోజుల కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వేవ్స్ 2025 గురించి తాజా సమాచారం పీఐబీ ద్వారా పొందండి
* * *
Release ID:
(Release ID: 2125675)
| Visitor Counter:
9
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam